తెలంగాణ

telangana

KTR About Musi River Beautification : 'ప్రపంచం ఆశ్చర్యపోయేలా మూసీ సుందరీకరణ'

By

Published : Mar 10, 2022, 12:20 PM IST

KTR About Musi River Beautification : హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన అన్ని హంగులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేనంత వేగంగా హైదరాబాద్​ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా మూసీ నది సుందరీకరణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

KTR About Musi River Beautification
KTR About Musi River Beautification

KTR About Musi River Beautification : దేశంలో ఎక్కడా లేనంత వేగంగా హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగర రవాణా మెరుగు పర్చేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. 5వేల 555కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌ -1, 3వేల 115కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-2 పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

KTR About Hyderabad Development: "హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి కావాల్సిన అన్ని హంగులను ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఏ నగరంలో జరగనంత వేగంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నాం. రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్‌లు, అండర్‌ పాస్‌లు, స్కై వంతెనలతో నగర ప్రజలకు రవాణా సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందని తెగ ఊదరకొడుతున్నారు. కానీ తీసుకువచ్చిన అప్పులకు డబుల్ ఆదాయం వచ్చేలా పనులు చేపడుతున్నాం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా భాగ్యనగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం."

- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

అద్భుతంగా.. మూసీ సుందరీకరణ

KTR in Assembly Sessions 2022 : మూసీ నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌ను 100 శాతం మురుగుజలాలను శుద్ధి చేసే నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా 36 ప్రాంతాల్లో 3వేల 866 కోట్లతో ఎస్టీపీ(సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌)లు నెలకొల్పుతున్నామని వెల్లడించారు. మూసీపై 3 చెక్‌డ్యామ్‌లు, 14 వంతెనలు నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. ఈ 14 వంతెనలు వైవిధ్యంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నామని చెప్పారు. దానికోసమే పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులను ఇతర దేశాలకు వెళ్లి అక్కడి వంతెనల నిర్మాణాలపై అధ్యయనం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశమే ఆశ్చర్యపోయేలా మూసీ సుందరీకరణ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

ప్రపంచం ఆశ్చర్యపోయేలా మూసీ సుందరీకరణ

ABOUT THE AUTHOR

...view details