తెలంగాణ

telangana

Harish Rao: వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీశ్ సమీక్ష.. కీలక ఆదేశాలు

By

Published : Nov 11, 2021, 8:36 PM IST

కరోనా టీకా పంపిణీ వేగవంతం చేయాలని, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రుల పనులు వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై సమీక్షించిన హరీశ్​.. టిమ్స్​, కింగ్​కోఠి ఆసుపత్రిలో ఇతర వైద్యసేవలు ప్రారంభించాలని సూచించారు.

harish rao review
harish rao review on health department

గచ్చిబౌలి టిమ్స్, కింగ్​ కోఠి జిల్లా ఆస్పత్రుల్లో కొవిడ్​ సహా ఇతర వైద్యసేవలు అందించాలని (telangana health minister harish rao review) రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు ఆశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సాధారణ వైద్య సేవల అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు కేంద్రంలో (ఎంసీఆర్ ​హెచ్​ఆర్​డీ) వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో హరీశ్​రావు (telangana health minister harish rao review) సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, టీకా పంపిణీ, కొత్త మెడిక‌ల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రుల నిర్మాణం, వ‌రంగ‌ల్‌లోని మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణం త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కింగ్ కోఠి ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలు పునరుద్ధరణ సహా టిమ్స్​లో 200 పడకలు కొవిడ్​ బాధితుల కోసం కేటాయించాలని, ఇతర వైద్య సేవలూ అందించాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్మాణ ప‌నులు వేగంగా పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొద‌టి డోస్ కరోనా వ్యాక్సినేషన్​ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. అదే జాతీయ స్థాయిలో 79 శాతం మందికి తొలి డోస్, 37.5 శాతం మందికి మాత్రమే రెండు డోస్​లు పూర్తయినట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో జాతీయ సగటుకు మించి టీకాలు పంపిణీ చేయటం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి, టీకా పంపిణీలో మరింత వేగం పెంచేందుకు.. శ‌నివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అంత‌కుముందు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్​సుక్​ మాండ‌వీయ‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మంత్రి హ‌రీశ్​రావు, వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

ఇదీచూడండి:Harish Rao: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి క్షమాపణలు చెప్పాలి: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details