తెలంగాణ

telangana

MLC Madhusudhanachari : గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

By

Published : Nov 19, 2021, 9:11 AM IST

Updated : Nov 19, 2021, 11:36 AM IST

MLC Madhusudhanachari
MLC Madhusudhanachari

09:09 November 19

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనాచారి

గవర్నర్ కోటా(governor quota mlc post)లో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనాచారి(MLC Madhusudanachari) నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(telangana governor tamilisai) ఆమోదించారు. సర్క్యులేషన్ పద్ధతిన మంత్రివర్గం ఆమోదించింది. 

గవర్నర్​ ఆమోదం

మంత్రుల సంతకాలతో రాష్ట్ర ప్రభుత్వం రాజ్​భవన్​కు దస్త్రం పంపింది. కౌశిక్ రెడ్డి పేరు స్థానంలో మధుసూదనాచారిని సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ తమిళిసై(telangana governor tamilisai) ఆమోదించారు. 

మధుసూదనాచారి ప్రస్థానం

సిరికొండ మధుసూదనాచారి(MLC Madhusudanachari) భూపాలపల్లి నియోజకవర్గం నుంచి 2014లో తెరాస తరఫున ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా తనదైన పంథాలో సేవలందించారు. 2018 ఎన్నికల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దిగి.. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి జిల్లాలో రాజకీయంగా ఆయన ప్రాధాన్యత తగ్గింది. గండ్ర తెరాసలో చేరిన తర్వాత క్రమంగా ఆయన ప్రాముఖ్యత క్షీణించింది.

శాసన మండలి సభ్యుడిగా కేసీఆర్ అవకాశం

పార్టీలో తన పరిస్థితి ఏంటో అర్థంగాక అగమ్యగోచర స్థితిలో ఉన్న మధుసూదనాచారి(MLC Madhusudanachari)కి తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు తెరలేచాయి. ఆయనకు శాసన మండలి ఛైర్మన్​గా అవకాశం ఇస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడటంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

కౌశిక్ ​రెడ్డి స్థానంలో...

తొలుత పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ(governor quota MLC madhusudanachari)గా ప్రతిపాదించిన సర్కార్.. గవర్నర్ తిరస్కరణతో ఆ అవకాశం మధుసూదనాచారికి ఇచ్చారు. ఆయణ్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి సర్కార్ ప్రతిపాదించి.. గవర్నర్​కు దస్త్రం పంపగా.. తమిళిసై సౌందరరాజన్ మధుసూదనాచారి(MLC Madhusudanachari) నియామకాన్ని ఆమోదించారు. 

ఇవీ చదవండి  :

Last Updated :Nov 19, 2021, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details