తెలంగాణ

telangana

Telangana IT Budget 2022-23 : ఐటీలో 80వేల కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక

By

Published : Mar 11, 2022, 9:57 AM IST

Telangana IT Budget 2022-23 : 2022-23 ఆర్థిక సంవత్సరంలో 80వేల మందికి ఐటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఐటీ ఎగుమతులను రెండు కోట్లకు చేర్చాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ ఆర్థిక ఏడాదికి బడ్జెట్ పద్దుల చర్చలో భాగంగా ఐటీ శాఖ పురోగతి, లక్ష్యాలను నివేదించింది.

Telangana IT Budget 2022-23
Telangana IT Budget 2022-23

Telangana IT Budget 2022-23 : వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులను రెండు లక్షల కోట్లకు చేర్చడంతో పాటు కొత్తగా 80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దుల్లో చర్చల్లో భాగంగా ఐటీ శాఖ పురోగతి, లక్ష్యాలను నివేదించింది. 2020-21లో 1,45,522 కోట్ల ఐటీ ఎగుమతులను చేరుకున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. కొత్తగా 46 వేల మందికి కొత్తగా ఉద్యోగవకాశాలు వచ్చినట్లు పేర్కొన్న ప్రభుత్వం.. మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 6,28,615కు చేరుకున్నట్లు వెల్లడించింది. 2020-21లో దేశవ్యాప్తంగా 1,38,000 ఐటీ ఉద్యోగాలు వస్తే ఒక్క తెలంగాణలోనే 33 శాతం వచ్చినట్లు వివరించింది.

IT Budget of Telangana 2022-23 : కొంపల్లిలో ఐటీ టవర్‌తో పాటు కొల్లూరు, ఉస్మాన్ సాగర్ ప్రాంతం, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలైన విమానాశ్రయం, శంషాబాద్ పరిసరాల్లో కొత్త ఐటీ క్లస్టర్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఉప్పల్, పోచారం ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించనున్నట్లు పేర్కొంది.

టీఎస్‌ ఐపాస్ ద్వారా 19వేల పరిశ్రమలు..

IT Jobs in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ విధానం ద్వారా ఇప్పటి వరకు 19,145 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. తద్వారా 16.43 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించినట్లు వివరించింది. రాష్ట్ర ఆవిర్భావం మొదలు 2021 వరకు టీఎస్ఐఐసీ ద్వారా 3210 మంది పారిశ్రామిక వేత్తలకు 2801 ఎకరాల భూమి కేటాయించినట్లు పేర్కొంది. తద్వారా 38,439 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 1,30,982 మందికి వ్యక్తులకు ఉపాధి లభించినట్లు చెప్పింది.

ప్రోత్సాహకాల కింద రూ.2142కోట్లు..

IT Exports in Telangana : పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద బడ్జెట్‌లో 2142 కోట్ల రూపాయలు, పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కోసం రూ.190 కోట్లు కేటాయించినట్లు వివరించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించేందుకు వీలుగా పావలావడ్డీ పథకాన్ని వర్తింపజేసేందుకు 187 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details