తెలంగాణ

telangana

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 50 మందికి పదోన్నతులు

By

Published : Mar 25, 2021, 11:53 PM IST

రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖలో పలువురు అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ జారీ చేశారు. త్వరలోనే మరో 300 మందికి ప్రమోషన్​ లభించే అవకాశం ఉందని ఆ శాఖకు చెందిన ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

promotions in telangana commercial tax department
రాష్ట్ర వాణిజ్య శాఖలో 50 మందికి పదోన్నతలు

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వివిధ క్యాడర్లకు చెందిన 50 మందికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదోన్నతులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని 31 మంది వాణిజ్యపన్నుల అధికారులకు సహాయ కమిషనర్లుగా పదోన్నతి లభించింది. అదే విధంగా 13 మంది సహాయ కమిషనర్లకు ఉపకమిషనర్లుగా, ఐదుగురు ఉప కమిషనర్లకు జాయింట్ కమిషనర్లుగా ప్రభుత్వం పదోన్నతి ​ కల్పించింది. ఉప వాణిజ్య పన్నుల శాఖలోని పలు విభాగాలలో మరో 300 మందికి పదోన్నతులు లభించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:'భాగ్యనగరం.. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం'

ABOUT THE AUTHOR

...view details