తెలంగాణ

telangana

300కి పైగా విద్యార్థులు ఉంటే షిప్టు విధానం.. విద్యా శాఖ మార్గదర్శకాలు

By

Published : Jan 12, 2021, 9:24 PM IST

Updated : Jan 12, 2021, 10:36 PM IST

education
education

21:23 January 12

300కి పైగా విద్యార్థులు ఉంటే షిప్టు విధానం.. విద్యా శాఖ మార్గదర్శకాలు

విద్యాసంస్థల ప్రారంభంపై విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాలలకు విద్యార్థుల హాజరు కోసం తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్​లైన్ తరగతులు కొనసాగుతాయని తెలిపింది. ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం అవసరం లేదని పేర్కొంది.  

ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించవద్దని..  వారికి డిటెన్షన్‌ ఉండబోదని విద్యాశాఖ స్పష్టం చేసింది. పదోతరగతి పరీక్షల షెడ్యూలు తర్వాత విడుదల చేస్తామని వెల్లడించింది. కాలేజీల్లో 300కి పైగా విద్యార్థులు ఉంటే షిప్టు విధానం అమలు చేయాలని ఆదేశించింది.  

ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో మార్పు ఉండబోదని... ఇంటర్ పరీక్షల్లో మరిన్ని ఛాయిస్‌లో ఇవ్వాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ తెలిపింది. ఇంటర్ పరీక్షల షెడ్యూలు త్వరలో వెల్లడిస్తామంది. 

ఇదీ చదవండి :ఈ నెల 25 నాటికి సిద్ధంగా ఉండాలి: మంత్రి సబితా

Last Updated : Jan 12, 2021, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details