తెలంగాణ

telangana

srisailam water flow : శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద

By

Published : Aug 5, 2021, 1:53 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా ఉద్ధృతంగా ఉన్న వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 213.40 టీఎంసీలు ఉంది.

srisailam project
శ్రీశైలం జలాశయం

శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద తగ్గుముఖం పడుతుండటంతో.. నాలుగు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.60 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.40 టీఎంసీలకు చేరుకుంది.

4 గేట్లు ఎత్తి సాగర్​కు నీటి విడుదల

జలాశయానికి ఇన్ ఫ్లో లక్షా 69 వేల 514 క్యూసెక్కులు ఉండగా... 2 లక్షల 8 వేల 787 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 4 గేట్ల ద్వారా లక్షా 11 వేల 564 క్యూసెక్కులు, ఎడమగట్టు నుంచి 33,549, కుడిగట్టు నుంచి 30,848 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 30,000, హంద్రీ నీవా నుంచి 2026, కల్వకుర్తి నుంచి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి:Etela Rajender: 'ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు'

ABOUT THE AUTHOR

...view details