తెలంగాణ

telangana

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​కు రేవంత్​రెడ్డి లేఖ..

By

Published : Sep 3, 2022, 9:09 PM IST

Revanthreddy Letter to Nirmala Sitharaman: రాష్ట్ర పర్యటనలో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీరు తప్పుపడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఫొటోల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. సమస్యలు పక్కనపెట్టి తెరాస-భాజపా వీధి నాటకాలకు తెర లేపాయని ఆరోపించారు.

Revanthreddy Letter to Nirmala Sitharaman
Revanthreddy Letter to Nirmala Sitharaman

Revanthreddy Letter to Nirmala Sitharaman: తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వైఖరిని తప్పుపడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఫొటోల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. సమస్యలు పక్కనపెట్టి తెరాస-భాజపా వీధి నాటకాలకు తెర లేపాయని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా వ్యవహారించడం దురదృష్టకరమని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. తెరాస-భాజపా సర్కార్‌లు ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయని దుయ్యబట్టారు.

మునుగోడు ఉప ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఇలా వీధి నాట‌కాల‌కు తెర‌తీయ‌డాన్ని... ప్రజ‌లు గ‌మ‌నిస్తున్నారని విమర్శించారు. జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి కేంద్రం ఒక్క పైసా రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎంఎంటీఎస్ రెండో దశ మూలన పడిందని తెలిపారు. కేసీఆర్​తో ఉ​న్న లాలూచీ ఏంటో బయటపెట్టాలని నిలదీశారు. కాళేశ్వరంలో కేసీఆర్ అండ్ కో విషయంలో ఎందుకు ఔదార్యం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏంటో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details