తెలంగాణ

telangana

Revanth Reddy Tweet : 'విద్యార్థులారా.. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యం'

By

Published : Jun 29, 2022, 12:58 PM IST

Revanth Reddy Tweet Today : ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం విలువ తెలుసుకుని.. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యమని హితవు పలికారు.

Revanth Reddy Tweet
Revanth Reddy Tweet

Revanth Reddy Tweet Today : ఇంటర్మీడియట్ ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేరోజు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని వాపోయారు. వారి తల్లిదండ్రుల పరిస్థితి చూస్తుంటే తన గుండె బరువెక్కుతోందని అన్నారు.

Revanth Reddy Tweet on Inter Results : ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినా.. మళ్లీ సప్లిమెంటరీ రాసుకోవచ్చని.. విద్యార్థులెవరూ అధైర్యపడొద్దని రేవంత్ సూచించారు. పరీక్షలకన్నా.. చదువుకన్నా.. ప్రాణాలు విలువైనవని.. తల్లిదండ్రులు విలువైన వారని చెప్పారు. వారి కోసమైనా తమ భవిష్యత్​ను అర్ధాంతరంగా ముగించుకోవద్దని అన్నారు.

మరోవైపు సప్లిమెంటరీ, రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ రుసుములను మాఫీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ కోరారు. ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్ చేస్తూ వారిని ట్యాగ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసమైనా తెలంగాణ సర్కార్‌ వీలైనంత త్వరగా చర్యలకు ఉపక్రమించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details