తెలంగాణ

telangana

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీపీ

By

Published : Nov 19, 2020, 4:53 AM IST

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని... రాచకొండ సీసీ మహేశ్ భగవత్ తెలిపారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'మూహ్ బంద్ కరో' కార్యాక్రమాన్ని సీపీ ప్రారంభించారు. బ్యాంకు, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పకూడదని సూచించారు.

rachakonda cp mahesh bhagavath started muh band karo program
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీపీ

పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగహన కల్పించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'మూహ్ బంద్ కరో' అవగాహన కార్యక్రమాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ, బ్యాంకు, ఎటీఎం కార్డు వివరాలు అడిగితే చెప్పకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ తెలిపారు.

తనకు కూడా అలాంటి నకిలీ కాల్స్ వస్తున్నాయని సీపీ వివరించారు. లాక్​డౌన్ నేరాలు తగ్గాయి, కానీ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని వివరించారు. వీటిని అరికట్టేందుకు అవగాహనే ముఖ్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ నేరాపై ఓ ర్యాపో సాంగ్​ను విడుదల చేశారు.

ఇదీ చూడండి:విద్యుత్ ఉద్యోగుల విభజనపై విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details