తెలంగాణ

telangana

PAWANKALYAN ON TWITTER: ఏపీ సీఎం జగన్​పై పవన్ సంచలన ట్వీట్

By

Published : Oct 8, 2021, 4:48 PM IST

ఏపీ సీఎం జగన్​పై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై వాగ్భాణాలు సంధించిన జనసేనాని.. ఆ తర్వాత ట్విటర్ (PAWANKALYAN ON TWITTER) లోనూ సమరం సాగించారు. తాజాగా.. మరో ట్వీట్ చేశారు.

PAWANKALYAN ON TWITTER
PAWANKALYAN ON TWITTER

ఏపీ సర్కారుపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై వాగ్భాణాలు సంధించిన జనసేనాని.. తాజాగా.. మరో ట్వీట్ (PAWANKALYAN ON TWITTER) చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వైకాపా పాలన లక్ష్యంగా పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు.

"తాకట్టులో ఆంధ్రప్రదేశ్"​ పేరుతో (PAWANKALYAN ON TWITTER) ఒక ఛార్ట్​ను పోస్టు చేశారు పవన్. విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను, చెత్త పన్ను వగైరా.. పన్నులను నవరత్నాలతో పోల్చిన జనసేనాని.. భావి తరాలకు మిగిలేది అప్పులేనని అన్నారు. కొందరికి మాత్రమే నవరత్నాలు ఇస్తున్నారని.. పన్నులు మాత్రం అందరి నుంచి భారీగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా హయాంలో ఆర్థిక వృద్ధి అథఃపాతాళానికి చేరిందని ఎద్దేవా చేశారు.

"ఎన్ని వాగ్ధానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా.. రాష్ట్ర బడ్జెట్​ను ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా.. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు. ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది." అని పోస్టులో రాసుకొచ్చారు.

ఇదీ చూడండి:KCR Speech in Assembly sessions 2021: కేంద్రం దగ్గరే లేవు.. ఇక తెలంగాణకు ఏమిస్తరు: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details