తెలంగాణ

telangana

రోడ్ల దుస్థితి తెలిసేలా.. పవన్‌ వ్యంగ్య చిత్రం ట్వీట్‌

By

Published : Jul 15, 2022, 2:34 PM IST

Pawan Kalyan Tweet on AP Roads : ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్​లో.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 'గుడ్ మార్నింగ్ సీఎం సార్ ' అనే హ్యాష్ ట్యాగ్ తో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని.. జనసేన కార్యకర్తలు, నాయకులకు సూచించారు. రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియజేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్ని పవన్ ట్విటర్​లో పోస్ట్ చేశారు.

Pawan Kalyan Tweet on AP Roads
Pawan Kalyan Tweet on AP Roads

Pawan Kalyan Tweet on AP Roads : ఏపీలో రహదారుల దుస్థితిని ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా.. జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్​లో.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్డు ప్రయాణం ఎంత నరకంగా మారిందో తెలియచేసే వ్యంగ్య చిత్రాన్ని పవన్ ట్విటర్​లో పోస్ట్ చేశారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రహదారిలో.. కొత్తపేట వద్ద అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్డు వీడియోను.. పోస్ట్ చేశారు.

'గుడ్ మార్నింగ్ సీఎం సార్ ' అనే హ్యాష్ ట్యాగ్ తో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని.. జనసేన కార్యకర్తలు, నాయకులకు పవన్ సూచించారు. ఏపీలో రోడ్లపై ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details