తెలంగాణ

telangana

గొడుగులతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. ఎక్కడంటే..!

By

Published : Oct 10, 2022, 4:49 PM IST

Passengers Traveling In RTC Bus With Umbrellas: ఏపీలో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా జోరువానలు అన్ని ప్రాంతాలను ముంచెత్తున్నాయి. అయితే ఎక్కడైనా, ఎవరైనా వర్షం లేదా ఎండలోనో గొడుగులు పట్టుకుంటారు. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్సులోనూ ప్రయాణికులు గొడుగులు పట్టుకుని వానకు తడవకుండా ప్రయాణించారు. అదేంటని వింతగా అనిపిస్తుంది కదా. కానీ ఆ ప్రయాణికులకు మాత్రం ఇది చాలా కష్టమైన పని. అసలు విషయం ఏంటంటే..?

Passengers Traveling In RTC Bus With Umbrellas
Passengers Traveling In RTC Bus With Umbrellas

Passengers Traveling In RTC Bus With Umbrellas: వర్షంలోనో, ఎండలోనో గొడుగు వేసుకుని వెళ్లడం చూస్తుంటాం. కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు గొడుగు వేసుకుని వెళ్లడం ఎప్పుడైనా చూశారా. ఇలాంటి అనుభవమే ఆంధ్రప్రదేశ్​లో విశాఖ నుంచి సాలూరు వెళ్తున్న.. అల్ట్రా డీలక్స్ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు చూడాల్సింది వచ్చింది. ఆదివారం రాత్రి జోరుగా వర్షం కురవడంతో బస్సు టాప్‌ నుంచి నీరు ధారల్లా కారింది.

గొడుగులు తెచ్చుకున్న కొందరు ప్రయాణికులు బస్సులోనూ వాటిని వేసుకుని ప్రయాణించారు. గొడుకులు తెచ్చుకోని వారు మాత్రం బస్సులో తడుస్తూనే ప్రయాణించాల్సి వచ్చిందని వారు అసహనం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details