తెలంగాణ

telangana

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ ఎంపీ రఘురామ కుమారుడు భరత్ లేఖ

By

Published : May 17, 2021, 7:36 AM IST

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ ఎంపీ రఘురామ కుమారుడు భరత్‌ లేఖ రాశారు. ఎంపీ అయిన తన తండ్రిని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

mp raghuram son, mp raghuram son bharat
ఎంపీ రఘురామ కుమారుడు, ఎంపీ రఘురామ కుమారుడు భరత్

ఏపీ ఎంపీ అయిన తన తండ్రిని సీఐడీ పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ.. రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు ఫిర్యాదు చేశారు. రెండు పేజీల లేఖతో పాటు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, పోలీసు కస్టడీలో తన తండ్రికి తగిలిన గాయాలు, ఏపీ హైకోర్టు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను జత చేశారు.

తాను సమర్పించిన రికార్డులన్నీ పరిశీలించి.. ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. భరత్‌ కోరారు. భారతీయ పరిపాలన, న్యాయవ్యవస్థపై సామాన్యులకు విశ్వాసం కలిగేలా చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :మెజిస్ట్రేట్ ఉత్తర్వులనూ పట్టించుకోరా.. సీఐడీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details