తెలంగాణ

telangana

'వేర్వేరు కుంపట్లు కాకుండా.. కాంగ్రెస గెలుపు కోసం కలిసి పనిచేస్తాం'

By

Published : Apr 11, 2022, 5:21 PM IST

Komatireddy Venkatreddy Comments: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా నియామితులైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అభినందనలు తెలిపేందుకు హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఆయన నివాసాని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే వేర్వేరు కుంపట్లు కాకుండా.. కలిసి పోరాటం చేయాలని కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్​గా నియమితులైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.

MP Komatireddy Venkatreddy Comments on differences between congress leaders
MP Komatireddy Venkatreddy Comments on differences between congress leaders

'వేర్వేరు కుంపట్లు కాకుండా.. కాంగ్రెస గెలుపు కోసం కలిసి పనిచేస్తాం'

Komatireddy Venkatreddy Comments: సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్​గా నియమితులైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి తెరాసలోకి వెళ్లిన ఎమ్మెల్యేల ఓటమిపై ఎక్కువగా దృష్టి సారిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే వేర్వేరు కుంపట్లు కాకుండా.. కలిసి పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా నియమితులైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అభినందనలు తెలిపేందుకు హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఆయన నివాసాని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

"నాపై నమ్మకంతో స్టార్ క్యాంపెనర్‌గా నియమించిన సోనియా, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, మణిక్కమ్ ఠాగూర్‌లకు ధన్యవాదాలు. పార్టీలో అందరిని కలుపుకుని తెరాస ఓటమి కోసం పనిచేస్తాం. రేపటి నుంచి వడ్ల కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళనలు ప్రారంభమవుతాయి. పార్టీలో ఉన్న పెద్ద నేతలందరం తలోవైపు వెళ్లి ఆందోళనలో పాల్గొంటాం. శ్రీలంకలో కుటుంబపాలన వల్లే ఆర్థిక సంక్షోభం వచ్చింది. తెలంగాణలోనూ అలాంటి ముప్పే పొంచి ఉంది." -కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details