తెలంగాణ

telangana

'తెదేపాకు ఓటేస్తే.. పచ్చని చెట్టు కింద చల్లని నీడలో గడుపుతారు'

By

Published : Mar 8, 2021, 12:57 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సడ్లపల్లిలో ప్రచారం చేశారు. వైకాపాకు ఓటేస్తే... ఎండలో మాడిపోతారని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం రెండేళ్లలో 50 మీటర్ల రోడ్డు వేయలేకపోయిందని మండిపడ్డారు.

mla balakrishna campaign at sadlapalli
'తెదేపాకు ఓటేస్తే.. పచ్చని చెట్టు కింద చల్లని నీడలో గడుపుతారు'

ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సడ్లపల్లిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. వైకాపాకు ఓటు వేస్తే ఎండలో మాడిపోతారని ఎద్దేవా చేశారు. తెదేపాకు ఓటు వేస్తే పచ్చని చెట్టు కింద చల్లని నీడలో గడుపుతారంటూ ప్రజలను తనదైన స్టైల్​లో ఓట్లను అభ్యర్థించారు.

వైకాపా ప్రభుత్వం రెండేళ్లలో 50 మీటర్లు రోడ్డు వేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి జరగాలంటే ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాకి ఓటువేసి గెలిపించాలని అన్నారు. పట్టణంలోని 5, 13, 14, 15, 29 వార్డులలో ప్రచారాన్ని నిర్వహించారు.

ఇదీ చూడండి:గత ఏడాది కంటే ఈసారి వైభవంగా శివరాత్రి ఉత్సవాలు: హరీశ్​

ABOUT THE AUTHOR

...view details