తెలంగాణ

telangana

AP minister fires on TS ministers : తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపాలి: వెల్లంపల్లి శ్రీనివాస్

By

Published : Nov 13, 2021, 1:54 PM IST

Updated : Nov 13, 2021, 2:06 PM IST

AP minister fires on TS ministers: తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఆంధ్రాపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

AP Minister Vellampalli on TG Ministers
AP Minister Vellampalli on TG Ministers

ఆంధ్రాపై.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR), మంత్రులు ఇష్టానుసారం ఆరోపణలు చేయడం సరికాదని ఏపీ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(AP minister vellampally srinivas) అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరికీ మంచివి కావని హితవు పలికారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న వెల్లంపల్లి.. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు ఏపీ సీఎం సుముఖంగా ఉన్నారన్నారు. బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తే.. నిధులు మంజూరు చేస్తారన్నారు.

ఏం జరిగిందంటే?

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్​ జిల్లాలో తెరాస నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (ts minister Prasanth reddy sensational comments on ap cm jagan)ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటారని అప్పట్లో అన్నారని.. కానీ ప్రస్తుతం ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమొత్తుకుంటున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారని.. రోజు ఖర్చుల కోసం కూడా కేంద్రంపై (ts minister Prasanth reddy sensational comments on ap cm jagan)ఆధారపడుతున్నారని ఆరోపించారు.

"తెలంగాణ వస్తే అడుక్కుతింటారని మనల్ని అన్నారు. కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన పైసలు ఆంధ్రాకు పోవట్లేదు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు. రోజు ఖర్చుల కోసం కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు అప్పులు లేకపోతే ఆంధ్రా నడవదు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఏపీలో బోర్లకు మీటర్లు పెడుతున్నారు. దేశం మొత్తం బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం మాత్రం భాజపా వాళ్ల కింద మీటర్లు పెట్టాలి."

-మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఈ వ్యాఖ్యలతో దమారం చెలరేగింది. నిధుల కోసం కేంద్రం వద్ద జగన్​ బిచ్చం ఎత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం(minister perni nani fire on telangana leaders statements) చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో అందరూ కలిసి హైదరాబాద్​ను అభివృద్ధి చేశారని, పాడికుండ లాంటి హైదరాబాద్ ఉన్నా... తెలంగాణ అప్పుల పాలైందని మంత్రి విమర్శించారు. తెలంగాణ నేతల వైఖరి అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లుగా.. ఉందని ఆక్షేపించారు. కేసీఆర్(telangana CM KCR) తరచూ కేంద్రం వద్దకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. నిధులిస్తే కేంద్రంలో చేరే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని మంత్రి అన్నారు. బయట కాలర్ ఎగరేసి... లోపలికెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్​కు రాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Last Updated : Nov 13, 2021, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details