తెలంగాణ

telangana

'విజయ డైరీ టర్నోవర్​ను రూ.1000 కోట్లకు పెంచుతాం'

By

Published : Apr 9, 2022, 5:14 PM IST

vijaya Dairy: హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని పీపుల్స్ ప్లాజాలో విజయ డెయిరీకి చెందిన నూతన ఐస్​క్రీమ్ పుష్​కార్ట్స్​(ట్రై సైకిళ్ల)ను... మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రారంభించారు. తెరాస ప్రభుత్వం వచ్చాక పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చాలా మార్గదర్శకాలు తీసుకువచ్చామని తెలిపారు.

minister-talasani-srinivas-yadav-launched-vijaya-dairy-pushcarts-in-hyderabad
minister-talasani-srinivas-yadav-launched-vijaya-dairy-pushcarts-in-hyderabad

vijaya Dairy: విజయ డైరీ టర్నోవర్​ను రూ.1000 కోట్లకు పెంచుతామని.. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని పీపుల్స్ ప్లాజాలో విజయ డెయిరీకి చెందిన నూతన ఐస్​క్రీమ్ పుష్​కార్ట్స్(ట్రై సైకిళ్ల)ను... మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదుర్స్ సిన్హా, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితర అధికారులు పాల్గొన్నారు. పాడిపరిశ్రమను రాబోయే రోజుల్లో మరింతగా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్​లో ఇంకా 35 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉందని... అందుకు అనుగుణంగా రైతులను పాడి వైపు మల్లిస్తే వారికి మరింత మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.

"2014కు ముందు 400 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డైరీని త్వరలో 1000 కోట్లకు పెంచుతాం. విజయ డైరీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. వేసవిలో డైరీ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేయాలని 50 శాతం సబ్సిడీ కింద వీటిని ఇస్తున్నాం. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద ఆధారం లేనివారికి అవకాశాలు కలుగుతాయి. ప్రతి చోట ఔట్​లెట్ రావాలని ఫ్రాంచైజీలను కూడా ఇస్తున్నాం. భవిష్యత్తులో ట్రై సైకిల్స్ పెంచుతాం. జిల్లాల్లో ఉత్పత్తి జరిగితే రవాణా ఖర్చు తగ్గుతుంది. ఆ కోణంలోనూ ఆలోచన ఉంది. పుష్​కాట్స్​తో ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు... ఎక్కడా కావాలంటే అక్కడ అమ్ముకోవచ్చు. తెరాస ప్రభుత్వం వచ్చాక పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చాలా మార్గదర్శకాలు తీసుకువచ్చాం." - తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మంత్రి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details