తెలంగాణ

telangana

ప్రపంచమే అబ్బురపడేలా నూతన సచివాలయం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

By

Published : Apr 5, 2022, 10:41 AM IST

Vemula Prashanth reddy review: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నూతన సచివాలయం... ప్రపంచమే అబ్బురపడే విధంగా ఉండనుందనీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొత్త సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై ఆర్ అండ్ ​బీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Vemula Prashanth reddy
Vemula Prashanth reddy

Vemula Prashanth reddy review: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై ఆర్ అండ్ ​బీ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫ్లోరింగ్, ఇంటీరియర్ వర్క్స్​పై అధికారులకు పలు సూచనలు చేశారు.

గడువులోగా పూర్తవ్వాలి..

మెయిన్ గ్రాండ్ ఎంట్రీ, బేస్మెంట్ ఎలివేషన్, కోర్ట్ యార్డ్, జీఆర్సీ కాలమ్స్ క్లాడింగ్, కాంపౌండ్ వాల్ అర్నమెంట్ గ్రిల్, ఫాల్ సీలింగ్, గ్రౌండ్ ఫ్లోర్ కారిడార్, గ్రానైట్స్ ఫ్లోరింగ్ డిజైన్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, ఎంట్రన్స్ లాబీ, ఆఫీసర్స్ ఛాంబర్స్, మంత్రుల ఛాంబర్స్ పనుల పురోగతిని ఒక్కొక్క ఫ్లోర్ వైస్ అడిగి తెలుసుకున్నారు. ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తు వరకు నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:KCR Delhi Tour Updates : సీఎం కేసీఆర్‌కు దిల్లీలో దంత చికిత్స

ABOUT THE AUTHOR

...view details