తెలంగాణ

telangana

ఫలవంతంగా కేటీఆర్ అమెరికా పర్యటన.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..

By

Published : Mar 27, 2022, 10:00 AM IST

Updated : Mar 27, 2022, 11:22 AM IST

Minister KTR US tour concludes
Minister KTR US tour concludes

09:52 March 27

చివరిరోజు రాష్ట్రంలో పెట్టుబడులకు 4 సంస్థల అంగీకారం..

KTR US tour: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సాగిన మంత్రి కేటీఆర్​ బృందం అమెరికా పర్యటన ఫలప్రదంగా ముగిసింది. చివరి రోజు రాష్ట్రంలో 4 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారంతెలిపాయి. హైదరాబాద్‌ ఫార్మారంగంలో విస్తరణకు వ్యూహాలు రచించినట్లు సదరు కంపెనీలు మంత్రి కేటీఆర్‌కు తెలిపాయి. రాష్ట్రంలో ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ ఎదుగుదలకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు.

పర్యటన చివరిరోజు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేలా మంత్రి కేటీఆర్​ ఆయా కంపెనీలను ఒప్పించగలిగారు. హైదరాబాద్‌లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో 17వందల 50 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతుల వల్ల తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ న్యూయార్క్‌లోని అడ్వెంట్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశమయ్యారు. భారత్‌లోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్‌లో మెజార్టీ వాటాలు కొనేందుకు 1750 కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్‌కు అడ్వెంట్ కంపెనీ నిర్ణయాన్ని వెల్లడించింది. అడ్వెంట్ కంపెనీ పెట్టుబడుల నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్​ స్వాగతించారు.

న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తోన్న స్లేబ్యాక్ ఫార్మా.. హైదరాబాద్‌లో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించంది. రాబోయే మూడేళ్లలో సుమారు 15వందల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. 2011లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి సాధించిన పురోగతి, విజయాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు గుర్తుచేశారు. హైదరాబాద్ ఫార్మారంగంలో స్లేబ్యాక్ ఫార్మా అసాధారణ ఎదుగుదల, విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ అభినందించారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్‌సైన్సెస్ రంగానికి హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలను ఉపయోగించుకుని స్లేబ్యాక్ కంపెనీ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న నమ్మకం తనుకు ఉందన్నారు.

అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా రెండు లక్షల వేల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అత్యాధునిక ప్రయోగశాలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, మూలధనం కోసం రెండేళ్లుగా 5 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందని 70 మందికి ఉద్యోగాలను కల్పించిందని మంత్రి కేటీఆర్‌కు కంపెనీ వివరించింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే అడ్వాన్స్ డ్ ల్యాబ్ లో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందన్నారు. 12 వేల 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్ వ్యాలీలో తాము ఏర్పాటుచేసే ఈ అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు చెప్పారు. నిరంతర ఔషధ తయారీ సదుపాయంతో హైదరాబాద్ ఫార్మారంగంలో విస్తరించాలనుకుంటున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

Last Updated :Mar 27, 2022, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details