తెలంగాణ

telangana

'మంచి రోజులు వచ్చేశాయ్.. మోదీ గిఫ్ట్​ అదిరిందిగా..'

By

Published : Jul 6, 2022, 9:47 AM IST

KTR Tweet Today : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ మహిళలకు సిలిండర్ ధర పెరుగుదలను కానుకగా ఇచ్చారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక దేశానికి మంచి రోజులు వచ్చినట్టేనని ట్వీట్ చేశారు.

KTR Tweet Today
KTR Tweet Today

KTR Tweet Today : తరచూ ట్విటర్​ వేదికగా కేంద్ర సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించే రాష్ట్ర మంత్రి కేటీఆర్.. ఇవాళ మరోసారి మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే ఇవాళ కేటీఆర్ మండిపాటు.. కేవలం ఆయనదే కాదు దేశ ప్రజలందరిది. ఎందుకంటే గృహ అవసరాలకు వినియోగించే ఎల్​పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచింది కేంద్ర సర్కార్. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విటర్​లో ఘాటుగా స్పందించారు.

"మంచిరోజులు వచ్చేశాయ్.. అందరికి శుభాకాంక్షలు.. గ్యాస్ సిలిండర్ ధరను పెంచి కేంద్రం ఇప్పుడు వంటింట్లోనూ మంట పెట్టింది. సిలిండర్ ధరల పెంపకాన్ని మోదీ భారతీయ మహిళలకు కానుకగా ఇచ్చేశారు." అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

గృహ అవసరాలకు వినియోగించే ఎల్​పీజీ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల సిలిండర్​ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్‌ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details