తెలంగాణ

telangana

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

By

Published : Mar 18, 2021, 1:17 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్‌పర్సన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు పలకడంతో తెదేపా బలం 20కి చేరింది. తాడిపత్రిలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.‌

thadipathri municipal chairman, jc prabhakar reddy
జేసీ ప్రభాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్

ఆంధ్రప్రదేశ్​లో ఆసక్తితో పాటు ఉత్కంఠను రేకెత్తించిన అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలిక ఛైర్మన్‌ ఎన్నిక... ఎట్టకేలకు తెలుగుదేశం వశమైంది. మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 18 మంది తెలుగుదేశం అభ్యర్థులతో పాటు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు జేసీకే మద్దతు తెలిపారు. మొత్తంగా తెదేపాకు 20 మంది సభ్యులు మద్దతు పలికారు. అధికార పార్టీ వైకాపాకు 18 ఓట్లు దక్కాయి.

తాడిపత్రిలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని .. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. గత 30 సంవత్సరాలుగా ఇలా ప్రశాంతంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఛైర్మన్​గా తెదేపా అధికారంలోకి వచ్చినా.. తాడిపత్రి అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:మహమ్మారి విరుచుకుపడ్డా నిలదొక్కుకుంటున్నాం: హరీశ్​

ABOUT THE AUTHOR

...view details