తెలంగాణ

telangana

'ఆకట్టుకునే వర్ణచిత్రాలు.. ఆకర్షించే డిజైన్ ఉత్పత్తులు'

By

Published : Dec 27, 2020, 8:08 AM IST

పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అభినందనీయమని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్​ కుమార్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్​లోని తాజ్‌బంజారా హోటల్​లో ప్రముఖ చిత్రకారుడు హరి చిత్రకళా ప్రదర్శన, యువ డిజైనర్ తేజస్విని రూపొందించిన ఉత్పత్తులు ప్రదర్శించారు.

irrigation secretary rajathkumar launch painting expo in tajbanjara
'ఆకట్టుకునే వర్ణచిత్రాలు.. ఆకర్షించే డిజైన్ ఉత్పత్తులు'

సామాజిక సేవల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా హోటల్​లో ప్రముఖ చిత్రాకారుడు హరి చిత్ర కళా ప్రదర్శనతో పాటు యువ డిజైనర్‌ తేజస్విని రూపొందించిన డిజైన్‌ ఉత్పత్తులను ప్రదర్శించారు. పేదలకు సాయం చేయడంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పేదలకు సేవలందించడంలో మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రదర్శనలో చిత్రకారుడు హరి కలం నుంచి జాలువారిని పలు వర్ణ చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. యువ డిజైన్‌ తేజశ్వని డిజైన్‌ చేసిన ఉత్పత్తులు మోడల్స్‌, సామాజికవేత్తలు, చిన్నారులు ప్రదర్శించి ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకున్నారు. ప్రదర్శన ద్వారా వచ్చిన నిధులల్లో కొంత భాగం గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సహాయం అందించనున్నట్టు నిర్వహకురాలు అనిత తెలిపారు. 5 రోజలు పాటు ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు.

'ఆకట్టుకునే వర్ణచిత్రాలు.. ఆకర్షించే డిజైన్ ఉత్పత్తులు'

ఇదీ చూడండి:తాజా తాజా కూరగాయలు... ఇంటి వద్దే పండించి తినేయరూ...!

ABOUT THE AUTHOR

...view details