తెలంగాణ

telangana

CM KCR: ' గొర్రెల పైసల్లో కేంద్రానిది రూపాయి ఉన్నా.. రాజీనామా చేస్తా'

By

Published : Nov 8, 2021, 5:05 PM IST

Updated : Nov 8, 2021, 7:38 PM IST

భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాల్లో ఒక్కటైనా ఉందా అని సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు. భాజపా అనేక దొంగ లెక్కలు చేసిందని విమర్శించారు. కొన్ని కారణాల వల్ల ఎస్సీని సీఎం చేయలేకపోయా అని వివరించారు. గొర్రెల పైసల్లో కేంద్ర ప్రభుత్వానిది రూపాయి ఉన్నా.. తాను రాజీనామా చేస్తా అని సీఎం సవాల్ విసిరారు.

CM KCR
CM KCR

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై (Bandi Sanjay) సీఎం కేసీఆర్ (CM KCR)​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మిస్టర్‌ బండి సంజయ్‌.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు' అంటూ హెచ్చరించారు. తన నియోజకవర్గంలో ఫామ్‌హౌస్‌ ఉందని అక్కడికెళ్తే తప్పా అంటూ నిలదీశారు. 'ఎస్సీని సీఎం చేస్తానన్నా.. చేయలేదు.. అది వాస్తవమే. నిజమే.. కొన్ని కారణాల వల్ల ఎస్సీని సీఎం చేయలేకపోయా. ఎస్సీని సీఎం చేయకుండానే రెండోసారి సీఎం అయ్యాను. ఎస్సీని సీఎం చేయని నా నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారు.' అని సీఎం కేసీఆర్ వివరించారు.

' గొర్రెల పైసల్లో కేంద్రానిది రూపాయి ఉన్నా.. రాజీనామా చేస్తా'

ఒక్క రూపాయి ఉన్నా...

గొర్రెల పైసల్లో కేంద్ర ప్రభుత్వానిది రూపాయి ఉన్నా.. తాను రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ (CM KCR) సవాల్ విసిరారు. గొర్రెల కోసం రుణం తీసుకున్నాం.. బాధ్యతగా తీరుస్తున్నామన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాల్లో ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. భాజపా అనేక దొంగ లెక్కలు చేసిందని... కర్ణాటకలో భాజపా దొడ్డిదారిన ప్రభుత్వంలోకి వచ్చిందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో భాజపా గెలవలేదని.. దొడ్డిదారిన సర్కారు నడుస్తోందని పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చిన పార్టీ భాజపా అని మండిపడ్డారు. ప్రశ్నించేవారిపై ఐటీ, ఈడీ దాడులు చేయించడం భాజపా నైజం అంటూ చురకలు అంటించారు.

అది జోక్‌ ఆఫ్‌ ద మిలీనియం

'మేం లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మరో 70వేలు ఇవ్వబోతున్నాం. జోనల్‌ చట్టం తీసుకొచ్చాం.. ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం. జోనల్‌ విధానం అమలు కారణంగా కాస్త ఆలస్యమవుతోంది.. మేం చేయగలిగిందే చెబుతాం. కేంద్రం.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టింది. కేసీఆర్‌ తెలంగాణకు ఏం చేశారన్నది జోక్‌ ఆఫ్‌ ద మిలీనియం. తెలంగాణ పథకాలను పార్లమెంటులోనే మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రగతిని ఆర్‌బీఐ కూడా మెచ్చుకుంది. తెలంగాణ సాధించిన ప్రగతిని ఏ భాజపా రాష్ట్రమైనా సాధించిందా?'

- కేసీఆర్, సీఎం

కిషన్‌రెడ్డి పారిపోయారు

ఎన్నోసార్లు రాజీనామాలు విసిరికొట్టినట్లు సీఎం కేసీఆర్ (CM KCR) గుర్తు చేశారు. తాము పదవులకు భయపడతామా అన్నారు. ఉద్యమ సమయంలో భాజపాకు లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.. కిషన్‌రెడ్డి పారిపోయారని విమర్శించారు. 'పదవులను చిత్తు కాగితాల్లా విసిరికొట్టాం.. మేం దద్దమ్మలమా? ప్రపంచ ఉద్యమాలకే పాఠం చెప్పిన ఘనత తెలంగాణ ఉద్యమానిది' అని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇదీ చదవండి :

నాకు సమాధానం కావాలి... అప్పటివరకు భాజపాను వదిలిపెట్టాను: కేసీఆర్​

'సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా కేసీఆర్ వ్యాఖ్యలు..'

'సీఎం సొంత జిల్లాలోనే ఆత్మహత్యలు.. రైతుల కోసం​ ఏం చేశారు.?

Last Updated :Nov 8, 2021, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details