తెలంగాణ

telangana

Telangana Tea Championship 2022 : టేస్టీ టీకి లక్ష రూపాయల బహుమతి

By

Published : Feb 17, 2022, 12:15 PM IST

Telangana Tea Championship 2022: వంట చేయడంలో మహిళలకు సాటీ.. పోటీ ఎవరూ లేరూ.. రాలేరు. గంటల తరబడి వంటగదిలో రుచికరమైన వంటలు చేసే ఆడవాళ్లు.. ఓ చిన్న కాంప్లిమెంట్‌ కోసం ఎంతో ఎదురుచూస్తారు. కానీ అలాంటి ప్రశంసలు లభించడం మహిళలకు చాలా అరుదు. కానీ ఓ ప్రముఖ సంస్థ మాత్రం.. గొంతుకు మంచి రుచిని అందించే.. మనసుకు హాయిని కలిగించే ఓ చాయ్ చేస్తే ఏకంగా లక్ష రూపాయలు ఇస్తోంది. టీ కి లక్ష రూపాయాలా.. అని ఆశ్చర్యపోతున్నారా. నిజమేనండి.. ఇలాంటి అరుదైన కార్యక్రమానికి హైదరాబాద్‌ వేదిక కాబోతోంది. దీని గురించి పూర్తిగా తెలియాలంటే.. ఈ స్టోరీ చదివేయాల్సిందే..

Telangana Tea Championship 2022
Telangana Tea Championship 2022

Telangana Tea Championship 2022: చాయ్.. అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరేమో. ఒకవేళ ఉన్నారంటే.. వాళ్లకు చాయ్ టేస్ట్ తెలియదని అర్థం. కప్పులో వేడివేడి చాయ్.. పక్కనే సమోసానో.. పకోడీనో ఉంటే ఆహా.. ఆ మజాయే వేరు. అది కాస్త అల్లం టీనో.. మసాలా చాయో అయితే మరింత హాయి. ఈ చాయ్ రుచి చేతిని బట్టి మారుతూ ఉంటుంది. కొందరు అల్లం వేసి అదరక్ చాయ్ చేస్తే.. మరికొందరు యాలకులు వేసి ఇలాచీ టీ చేస్తారు. ఇంకొందరు మసాలా చాయ్‌తో అప్పటిదాకా పడ్డ ఒత్తిడిని మరిపిస్తారు.

Telangana Tea Championship in Hyderabad: చాయ్‌ చేయడంలో మహిళలది అందె వేసిన చేయి. ఎన్ని రకాల వంటలనైనా ఒంటి చేత్తో.. అలసట లేకుండా చేసే ఆడవాళ్లు.. చాయ్‌ను మాత్రం ఎంతో ప్రేమతో తయారు చేస్తారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ఓ ప్రముఖ సంస్థ మార్చి 6న హైదరాబాద్‌లో.. తెలంగాణ టీ ఛాంపియన్‌షిప్-2022 పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నీలోఫర్ కెఫేతో కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రుచికరమైన చాయ్ చేసిన మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. మొదటి విజేతకు రూ.లక్ష రూపాయల నగదు.. రెండో విజేతకు రూ.50వేలు, రన్నరప్‌కు రూ.25వేలు బహుమతిగా ఇవ్వనున్నారు.

ఇందులో పాల్గొనాలంటే ఏం చేయాలంటే..

Telangana Tea Championship at Novatel: ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే మహిళలు.. వారు తయారు చేసిన టీ గురించి ఒక నిమిషం నిడివి గల వీడియో చేసి 8340974747 నంబర్‌కు వాట్సాప్ చేయాలి. నిర్వాహకులు ఈ వీడియోలు చూసి అందులో నుంచి 100 మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు మార్చి 6న హైదరాబాద్‌ నోవాటెల్ హోటల్‌లో నిర్వహించనున్న తెలంగాణ టీ చాంపియన్‌షిప్-2022లో పాల్గొని చాయ్ తయారు చేస్తారు. వాళ్లు తయారు చేసిన టీని టీ టేస్టర్స్‌ రుచి చూస్తారు. టీ టేస్టర్స్‌ ఫీడ్‌ బ్యాక్‌తో నిర్వాహకులు విజేతలను ఎంపిక చేసి వారికి నగదు బహుమతులు అందజేస్తారు.

ABOUT THE AUTHOR

...view details