తెలంగాణ

telangana

'ఒళ్లు దగ్గర పెట్టుకోండి'... రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరికలు

By

Published : Jul 30, 2020, 5:56 PM IST

హైదరాబాద్​లో లాక్​డౌన్​ సడలింపుల అనంతరం పెరిగిన నేరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే... ఊరుకునేది లేదని రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. సత్ప్రవర్తన కలిగి ఉంటే మాత్రం రౌడీషీట్​ ఎత్తివేస్తామని ఆఫర్లు కూడా ఇచ్చారు.

hyderabad police warns rowdy sheeters
hyderabad police warns rowdy sheeters

లాక్​డౌన్ సడలింపుతో నగరంలో నేరాలు పెరిగాయి. ముఖ్యంగా గ్యాంగ్ వార్​లు ఎక్కువ సంఖ్యలో జరుగుతుండటం వల్ల పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెలలో దక్షిణ, పశ్చిమ మండలాల్లోనే హత్యలు ఎక్కువగా జరగటం కలవరపెడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని రౌడీషీటర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీషీట్లు ఎత్తివేస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హామీ ఇచ్చారు. దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. రౌడీషీట్లు నమోదైతే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగం లభించదని, అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details