తెలంగాణ

telangana

రూ.1.38 కోట్లు విలువైన గంజాయి స్వాధీనం

By

Published : Jul 3, 2020, 10:05 PM IST

హైదరాబాద్‌ జోన్‌ డీఆర్‌ఐ అధికారులు రూ.1.38 కోట్లు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో లారీ డ్రైవర్​ వెనుకవైపు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన క్యాబిన్​లో 356.9 కిలోల గంజాయిని గుర్తించారు.

HYDERABAD DRI ZONE SEIZED 356 KILOS OF GANJA
రూ.1.38 కోట్లు విలువైన గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌ జోన్‌ డీఆర్‌ఐ అధికారులు 356.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.38 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎలా దొరికారంటే..

మహారాష్ట్రకు గంజాయి తరలిపోతున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన డీఆర్‌ఐ అధికారులు నగర శివారులోని ముంబయి హైవే వద్ద కాపుకాచారు. అటుగా వస్తున్న లారీని తనిఖీ చేశారు. లారీ ఖాళీగా కనిపించింది. పక్కా సమాచారం ఉండడంతో మరింత పరీశీలనగా చూశారు. ఎట్టకేలకు లారీ డ్రైవర్​ వెనుకవైపు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన క్యాబిన్​లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 156 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఈనెల రెండో తేదీన జరిగింది. ఇందుకు సంబంధించిన దర్యాప్తు జరుగుతోందని డీఆర్​ఐ అధికారులు తెలిపారు.

ఇవీచూడండి:ఖమ్మంలో 440 కిలోల గంజాయి స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details