తెలంగాణ

telangana

కోయంబత్తూరు నుంచి నగరానికి గ్రీన్​ ఛానల్​ ద్వారా అవయవాలు

By

Published : Nov 6, 2020, 10:15 PM IST

కేవలం 28 నిమిషాల్లో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఊపిరితిత్తులను అంబులెన్స్‌లో బేగంపేటలోని కిమ్స్‌కు చేరుకున్నాయి. వేగంగా తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యల చేపట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు.

Human organs reached hyderabad from Coimbatore
కోయంబత్తూరు నుంచి నగరానికి చేరుకున్న మానవ అవయవాలు

కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మానవ అవయవాలు.. పోలీసులు చేపట్టిన చర్యల వల్ల వేగంగా కిమ్స్‌ ఆసుపత్రికి చేరుకున్నాయి. ఇందుకోసం పోలీసులు ఎక్కడి వాహనాలను అక్కడ నిలిపివేసి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు.

ఊపిరితిత్తులు విమానంలో ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి అవయవ మార్పిడి కోసం బేగంపేటలోని కిమ్స్‌ ఆసుపత్రికి వీటిని తరలించాల్సి ఉండగా.. కేవలం 28 నిమిషాల్లో ఊపిరితిత్తులను అంబులెన్స్‌లో తీసుకువెళ్లారు. వేగంగా తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన చర్యలను పలువురు అభినందించారు.

ఇదీ చూడండి:ఇద్దరు ప్రత్యేక అధికారులు, 15 మంది సర్పంచ్‌లు సస్పెన్షన్‌

ABOUT THE AUTHOR

...view details