తెలంగాణ

telangana

current bill: హోటల్​కు కరెంట్​ బిల్​ షాక్.. ఎన్ని కోట్లంటే?

By

Published : Sep 8, 2021, 10:24 PM IST

current bill
ఏపీలో హోటల్​కు కోట్లలో కరెంట్​ బిల్

అదో రోడ్డు పక్కన చిన్న టిఫిన్ సెంటర్. వారికి మహా అయితే ప్రతి నెలా రూ.600 నుంచి రూ.700 వరకు కరెంట్ బిల్లు వస్తుంది. కానీ ఈ నెలలో మాత్రం వచ్చిన బిల్లు చూస్తే వారికి నిజంగానే కరెంట్​ షాక్ తగిలింది. అక్షరాలా రూ.21 కోట్లకు పైగా వచ్చిన బిల్లును చూసిన హోటల్ నిర్వాహకులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా.. అయితే చదివేయండి.

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ అల్పాహారశాలకు సెప్టెంబర్ నెలలో.. 21 కోట్ల 48 లక్షల 62వేల 224 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసిన హోటల్ నిర్వాహకులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఇంత హోటల్​కు అంతా బిల్లా అంటూ నోరెళ్లబెట్టారు. గత నెలలోనూ ఇదే విధంగా రూ.47,148 విద్యుత్ బిల్లు వచ్చిందని వారు వాపోయారు. ఏం చేయాలో దిక్కుతోచక విద్యుత్ శాఖ ఆఫీసుకు పరుగులు తీశారు. విషయాన్ని అధికారులకు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదుతో కరెంట్ మీటర్​లో సాంకేతికలోపాన్ని గుర్తించిన అధికారులు.. కొత్త మీటర్​ అమర్చారు.

అయినప్పటికీ..!

మళ్లీ భారీగా బిల్లు రావడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ప్రతి నెలా రూ.600 నుంచి రూ.700 మధ్య బిల్లు వస్తుందని, ఇలా ఎక్కువ మొత్తంలో రావడంతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని బాధితులు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. చింతలపూడి మండలం విద్యుత్​శాఖ ఏఈ శంకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా.. సాంకేతికలోపం కారణంగా అంత బిల్లు వచ్చిందని.. దానిని సరిచేశామని తెలిపారు.

ఇదీచదవండి:

CM KCR: కాళోజీ స్ఫూర్తి.. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచి: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details