తెలంగాణ

telangana

Secret Cameras: సీక్రెట్‌ కెమెరాలను ఎలా గుర్తించాలి..?

By

Published : Sep 24, 2021, 8:36 AM IST

Secret Cameras

అవినీతిపరులు, లంచగొండులను పట్టించేందుకు ఉపయోగించాల్సిన సీక్రెట్ కెమెరాలను మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించేందుకు వినియోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఫుడ్ కోర్టులో జరిగిన ఘటనతో రహస్య కెమెరాల వినియోగంపై కలకలం రేపింది. నిందితుడు యువతుల వీడియోలు చిత్రీకరించేందుకు తన సెల్‌ఫోన్‌నే అమర్చి నేరానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో స్పై కెమెరాలు ఏవిధంగా రూపాంతరం చెందాయి... వాటిని మనం ఎలా గుర్తించాలో చూద్దాం.

Secret Cameras: సీక్రెట్‌ కెమెరాలను ఎలా గుర్తించాలి..?

జూబ్లీహిల్స్ వన్​డ్రైవ్​ ఫుడ్​కోర్టులో పదిహేడేళ్ల బాలుడు మహిళల వాష్​రూంలో రహస్యంగా అమర్చిన సెల్‌ఫోన్‌తో వీడియో రికార్డ్ చేసిన ఘటన తాజాగా నగరంలో కలకలం రేపుతోంది. గతంలో సుల్తాన్‌ బజార్‌లో జరిగిన ఘటన మరువక ముందే తాజాగా జూబ్లీహిల్స్‌లో ఇదే తరహా నేరం నమోదైంది. ఓ మైనర్ తన చరవాణిని రికార్డింగ్ కోసం వినియోగించాడు.

హోటళ్లు, వాష్​రూమ్స్, చేంజింగ్ రూమ్స్‌లో దొరక్కుండా ఉండేందుకు స్పై కెమెరాలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇవి ఎక్కువగా బేగంబజార్, కోఠి, నాగార్జున సర్కిల్ వంటి ప్రాంతాల్లో అమ్ముతుంటారు. ప్రస్తుతం సాంకేతికతతో పెన్నులో, షర్ట్ బటన్‌లో ఇమిడిపోయేంత కెమెరాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఛార్జింగ్ ఎడాప్టర్, ఎల్​ఈడీ బల్బు, హోల్డర్, స్విచ్​బోర్డు, ఫ్యాన్, ఏసీ వంటి వస్తువుల్లో ఇమిడిపోయేలా ఉన్న కెమెరాలను అమర్చి ఏమారుస్తున్నారని, వీటిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సీక్రెట్ కెమెరాలు ఏదైనా వస్తువులో అమర్చి ఏర్పాటు చేస్తే వాటిని కనిపెట్టడం చాలా కష్టం. అయితే వీటిలో ఎక్కువ స్పై కెమెరాలు నల్లని రంగులోనే ఉంటాయి. వీటిలో వైర్​లెస్​ కెమెరాలు, హై డెఫినిషెన్‌తో రికార్డింగ్ సదుపాయం ఉండటంతో వీటిని నేరస్థులు వినియోగిస్తున్నారు. మైక్రో ఎస్​డీ కార్డు దీనికి అమర్చి డేటా స్టోరేజీ చేస్తారు. తర్వాత దాన్ని ఫోన్‌, కంప్యూటర్‌కు అనుసంధానించి దుర్వినియోగం చేస్తున్నారు. వైఫై ఆధారంగా కెమెరాలను ఆపరేట్ చేసే వెసులుబాటు ప్రస్తుతం అందుబాటులో ఉంది. డిటెక్టిఫై, రాడార్ బోట్ వంటి అప్లికేషన్లు మన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవటం ద్వారా ఫ్రీక్వెన్సీని కాప్చర్ చేయటం ద్వారా ఇటువంటి సీక్రెట్ కెమెరాలను గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, ఛేంజింగ్ రూమ్స్‌ను వినియోగించే ముందు అక్కడ ఏదైనా అనుమానం కలిగించేలా ఉంటే వెంటనే గుర్తించాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాతే వాటిని వినియోగించాలని సూచిస్తున్నారు. అనుమానం కలిగేలా ఏదైనా వస్తువు గుర్తించడం ద్వారా మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలని సైబర్​ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీచూడండి:Camera in Bathroom case: మహిళల బాత్​రూమ్​లో సెల్​ఫోన్​ కెమెరా.. ఈ ఘనకార్యం ఎవరిదంటే..?

ABOUT THE AUTHOR

...view details