తెలంగాణ

telangana

హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు.. నేడు విచారణ

By

Published : Jun 15, 2022, 8:34 AM IST

Amaravati farmers News : ఏపీ రాజధాని రైతులకు ఏటా ప్రభుత్వం ఇచ్చే కౌలు సకాలంలో ఇవ్వట్లేదని దాఖలైన పిటిషన్​పై ఆ రాష్ట్ర హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. నిర్ణీత గడువులోగా కౌలు విడుదల చేయకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు.

Amaravati farmers News
Amaravati farmers News

Amaravati farmers News : ఏపీ రాజధాని రైతులకు ఏటా ప్రభుత్వం ఇచ్చే కౌలు సకాలంలో ఇవ్వకపోవడంపై అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల జీవనోపాధికి ప్రభుత్వం నిర్ణీత కౌలు నిర్ణయించి ఏటా మే 1వ తేదీ లోపు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ మేరకు అప్పటి ప్రభుత్వం జీవో నంబరు 75/2016లో స్పష్టం చేసింది. 23 వేల మంది రైతులకు ఏటా రూ. 200 కోట్లు కౌలు రూపంలో చెల్చించనున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణీత గడువులోగా కౌలు విడుదల చేయకపోవటంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నేడు ఈ పిటీషన్​పై ప్రముఖ న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించనున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన తెదేపా నాయకుడు పోతినేని శ్రీనివాసరావు.. హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details