తెలంగాణ

telangana

'కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తున్నారు.. పోతున్నారు.. ఏమైనా ఒరిగిందా'

By

Published : Sep 23, 2022, 5:22 PM IST

minister harishrao

Harishrao criticism of central Ministers: రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక సభ అంటూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులను ప్రతివారం ఇక్కడికి పంపిస్తున్నారని మంత్రి హరీశ్​రావు భాజపా తీరుపై ధ్వజమెత్తారు. ఇంత మంది కేంద్రమంత్రులు వస్తున్న ఎవరూ అభివృద్ధి గురించి ఒక్క ముక్కైనా మాట్లాడడం లేదని వ్యాఖ్యానించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను పరిశీలించాలని హితవు పలికారు.

Harishrao criticism of Union Ministers: కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తున్నారు.. వెళ్తున్నారు.. కానీ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో భాజపాను అధికారంలో నిలబెట్టడం కోసం కేంద్రం నుంచి మంత్రులు వస్తున్నారు.. తప్ప అభివృద్ధి గురించి వచ్చిన వారు ఆలోచించారా అని మంత్రి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అధిగమిస్తోందని ఆయన పేర్కొన్నారు.

మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీకి అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్రం అనేక రకాల సమస్యలు సృష్టిస్తోందని ఆయన తెలిపారు. ఈ సమస్యకు అసలు పరిష్కారమే చూపడంలేదని కేంద్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చేరిగారు.

ఇన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బీబీనగర్ ఎయిమ్స్​లో మాత్రం సరైన వసతులు లేవని మండిపడ్డారు. వారం వారం రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. లేని పక్షంలో కనీసం ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను పరిశీలించి వారి వారి రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details