తెలంగాణ

telangana

RAINS: వర్షాలపై గవర్నర్ సమీక్ష.. ఆకలి తీర్చిన కవిత

By

Published : Sep 8, 2021, 4:18 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చేయూతనిచ్చేందుకు రెడ్ క్రాస్ వాలంటీర్లు.. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, ప్రభుత్వ సహాయక టీంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న బాధితులకు ఆహారాన్ని అందించి సాయం చేశారు ఎమ్మెల్సీ కవిత.

RAINS
RAINS

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో స్థానికంగా తీసుకోవాల్సిన పునరావాస, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. కుండపోత వర్షాలతో అల్లాడుతోన్న రాష్ట్ర ప్రజలకు చేయూతనిచ్చేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్లు.. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, ప్రభుత్వ సహాయక టీంతో కలిసి పనిచేయాలని గవర్నర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అండగా నిలిచిన కవిత

భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న బాధితులకు ఆహారాన్ని అందించి సాయం చేశారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ నగరంలో గత 24 గంటలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని గంగస్థాన్ కాలనీలోని శివారు, ఒడ్డెర కాలనీలోని ఇల్లు నీట మునిగాయి. ఇంట్లో ఆహార పదార్థాలతో పాటు ఇతర సామగ్రి పూర్తిగా తడిసిపోయింది. ఆహారం లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఆహారాన్ని అందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గతకొన్నేళ్ళుగా కవిత చెపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమములో భాగంగా ఆహారాన్ని అందించారు. కవిత అనుచరులు సోమవారం రాత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవీ చూడండి:PROBLEMS WITH FLOODS: వాగులు పొంగుతున్నాయి.. ప్రాణాలను బలిగొంటున్నాయి!

ABOUT THE AUTHOR

...view details