తెలంగాణ

telangana

నెమ్మదిస్తున్న గోదావరి.. కొనసాగుతున్న కృష్ణా ప్రవాహం..

By

Published : Jul 18, 2022, 9:36 AM IST

GODAVARI FLOOD LEVEL: గోదావరికి క్రమేణా వరద తగ్గుముఖం పడుతుండగా, కృష్ణాలో శ్రీశైలానికి ప్రవాహం కొనసాగుతోంది. గోదావరిలో ఎగువన ప్రవాహం తగ్గి భద్రాచలం వద్ద కూడా నెమ్మదించినప్పటికీ, ఇంకా ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నిన్న సాయంత్రం ఆరు గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 58.5 అడుగులు ఉండగా, 17.14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది.

godavari
గోదావరి

GODAVARI FLOOD LEVEL: వారం రోజులుగా మహోగ్రంగా ప్రవహిస్తున్న గోదావరి కాస్త శాంతించినట్లు కనిపిస్తుండగా, కృష్ణాలో శ్రీశైలానికి ప్రవాహం కొనసాగుతోంది. గోదావరిలో ఎగువన ప్రవాహం తగ్గి భద్రాచలం వద్ద కూడా నెమ్మదించినప్పటికీ, ఇంకా ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 58.5 అడుగులు ఉండగా, 17.14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. అంటే ప్రమాదకర స్థాయికి మించి అయిదు అడుగులకు పైగా నీటిమట్టం ఉంది. ఎగువన శ్రీరామసాగర్‌ నుంచి ఎల్లంపల్లి వరకు గోదావరి ప్రవాహం తగ్గింది. అన్నారం నుంచి కూడా నామమాత్రంగా నీటి విడుదల ఉండగా, ప్రాణహిత నుంచి ఇప్పటికీ భారీగా వరద వస్తుండటంతో మేడిగడ్డ నుంచి 9.28 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆలమట్టి, తుంగభద్రల నుంచి కృష్ణా ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలంలోకి 3.05 లక్షల క్యూసెక్కులు రాగా, ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా 25 వేలు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కులు వదులుతున్నారు.

ముంపు నుంచి క్రమేణా తేరుకొంటూ..

ఏజెన్సీలో ముంపు ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాలు ఇంకా బాహ్యప్రపంచానికి దూరంగానే ఉన్నాయి. ఆదివారం సీఎం రాకతో పట్టణంలోని వంతెనపైకి వాహనాలను అనుమతించారు. భద్రాచలం నుంచి బూర్గంపాడు వైపు కూడా రాకపోకలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలోని సుభాష్‌నగర్‌ కాలనీ, అశోక్‌నగర్‌ కాలనీ, అయ్యప్పకాలనీల్లో వరద నీరు ఇంకా నిలిచే ఉంది. బూర్గంపాడు ప్రధాన రహదారిపై వరద నీరు తగ్గినా.. లోతట్టు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details