తెలంగాణ

telangana

KIMS : దక్షిణాదిలో విస్తరించేందుకు కిమ్స్‌ ప్రణాళికలు

By

Published : Jun 15, 2021, 8:56 AM IST

ఆరోగ్య సేవల రంగంలో విశేష అనుభవమున్న కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్- కిమ్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు.. దక్షిణాదిలో మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సొంత నిధులతో పాటు.. ఈనెల 16న ఐపీఓకు వెళ్లనున్నట్లు వెల్లడించింది.

KIMS Hospitals MD G. Bhaskar Rao, KIMS Hospital, Krishna Institute of Medical Sciences
కిమ్స్ ఆసుపత్రుల ఎండీ జి.భాస్కర్ రావు, కిమ్స్ ఆస్పత్రి, కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్

ఆరోగ్య సేవల రంగంలో విశేష అనుభవమున్న కృష్ణ ఇని​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్- కిమ్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు..దక్షిణాదిలో మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. తద్వారా ప్రస్తుతం ఉన్న పడకల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు కిమ్స్ ఆసుపత్రుల ఎండీ జి.భాస్కర్ రావు తెలిపారు. దీనికోసం సొంత నిధులతో పాటు.. ఈనెల 16వ తేదీన ఐపీవోకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో కిమ్స్ గ్రూపు విస్తరణ పనులు ప్రారంభించగా.. త్వరలో విజయవాడ, గుంటూరు, కడప జిల్లాల్లో విస్తరణ అవకాశాలు పరిశీలిస్తున్నట్లు భాస్కర్ రావు చెప్పారు. రోగులు, నిపుణులైన డాక్టర్లు, నమ్మకమైన ఇన్వెస్టర్లే తమ నిలకడైన వృద్ధికి కారణమని అన్నారు. ఐపీవో ద్వారా నిధుల సమీకరణ, కిమ్స్ ఆసుపత్రుల విస్తరణ ప్రణాళికలపై మరిన్ని విషయాలు ఆయన ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

కిమ్స్ ఆసుపత్రుల ఎండీ జి.భాస్కర్ రావు

ABOUT THE AUTHOR

...view details