తెలంగాణ

telangana

ప్రమాణస్వీకారం అనంతరం జగన్‌ కాళ్లు మొక్కారు.. ముద్దులు పెట్టారు..!!

By

Published : Apr 11, 2022, 3:23 PM IST

AP New Ministers : ఏపీ కొత్త కేబినేట్​ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం కొందరు కొత్త మంత్రులు వీర విధేయతను చాటుకున్నారు. జగన్‌ కాళ్లకు మొక్కి.. చేతులు ముద్దాడి వెళ్లారు.

AP New Ministers
AP New Ministers

AP New Ministers: ఏపీ మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణస్వీకారం అనంతరం పలువురు మంత్రులు సీఎం జగన్‌ వద్ద తమ విధేయతను చాటుకున్నారు. కొందరు సీఎం జగన్​, గవర్నర్ బిశ్వభూషణ్‌కు నమస్కరించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం జగన్‌ కాళ్లు మొక్కారు. మంత్రి నారాయణస్వామి సీఎం జగన్‌ కాళ్లు తాకి నమస్కరించారు. మరో మంత్రి ఉష శ్రీచరణ్‌ ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కారు.

మరో ఇద్దరు మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, జోగి రమేశ్‌ ఇంకాస్త విధేయతతో మోకాళ్లపై పడి మరీ దండాలు పెట్టారు. మంత్రి రోజా సైతం.. ప్రమాణస్వీకారం తర్వాత సీఎం వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించి, చేతిని ముద్దాడి కృతజ్ఞత తెలుపుకున్నారు. మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్​, సీఎం జగన్​తో కలిసి గ్రూపు ఫొటో దిగారు.

జగన్‌ కాళ్లు మొక్కారు.. ముద్దులు పెట్టారు..!!

ఇదీ చదవండి:Jagan New Cabinet: కొలువుదీరిన జగన్ కొత్త టీం

ABOUT THE AUTHOR

...view details