తెలంగాణ

telangana

టాప్​టెన్​ న్యూస్​ @5PM

By

Published : Oct 29, 2020, 4:57 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్​ @5PM

1. ఒక్క క్లిక్​ చాలు

రాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల సమగ్ర స్వరూపం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ భూములకు సంబంధించి సమగ్ర సమాచారం ఒక్క క్లిక్‌తో లభ్యంకానుంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానం.. ధరణి పోర్టల్‌ను సర్కార్‌ అధికారికంగా ప్రజల ముంగిటకు తెచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. హైకోర్టుకు వెళ్లండి

హైదరాబాద్‌లో చెరువులు, నాలాల దురాక్రమణపై విచారించేందుకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం నిరాకరించింది. భాగ్యనగరంలో చెరువులు, నాలాల ఆక్రమణ జరిగిందని.. ఇటీవలి వరదలకు ఇదే ప్రధాన కారణమంటూ... జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిర్లాస్కర్​ కమిటీ ప్రతిపాదనలు అమలుకావట్లేదని పిటిషనర్​ ఎన్జీటీకి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. చెవులు, ముక్కు కోసిన దుండగులు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేట్​లో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళ లక్ష్మిని తీవ్రంగా గాయపరిచి... ఆమె చెవులకు ఉన్న బంగారు ఆభరణాలు, చేతులకు ఉన్న వెండి ఆభరణాలు, కాళ్ల గొలుసులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. స్పృహ కోల్పోయి ఇంట్లో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా... బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సాయం కోసం ఆందోళన

వరద ముంపు ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న పది వేల రూపాయల ఆర్థిక సహాయం కోసం బాధితులు ఆందోళనకు దిగారు. గోశామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు అబిడ్స్​లోని జీహెచ్​ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. భాజపా-ఎల్​జేపీలదే అధికారం

బిహార్​లో లోక్​జనశక్తి పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​. తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం స్పష్టంగా తెలుస్తోందన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగిన మరుసటి రోజునే ఈ మేరకు వ్యాఖ్యానించటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. సూపర్​ స్టార్​ కీలక వ్యాఖ్యలు!

సినీ నటుడు రజినీకాంత్​ తన రాజకీయ అరంగేంట్రపై పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన రాజకీయాలకు గుడ్​ బై చెప్పారంటూ వైరల్​ అయిన లేఖపై రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. భారీ ఆధిక్యంలో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుస్తారని ఓ సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్​ కన్నా బైడెన్​ 12 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు గురువారం దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర స్వల్పంగా రూ.121 తగ్గింది. వెండి ధర భారీగా తగ్గి.. కిలోకు రూ.61 వేల దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. వైఫల్యాలకు అదే కారణం

ఈ ఐపీఎల్​లో చెన్నై విఫలమవడానికి గల కారణాన్ని చెప్పిన బ్రియాన్ లారా.. యువ ఆటగాళ్లకు జట్టులో చోటివ్వాలని సూచించాడు. తర్వాతి సీజన్​లోనైనా తిరిగి పుంజుకోవాలని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. అలరిస్తున్న ద వైట్ టైగర్

ప్రియాంక చోప్రా హీరోయిన్​గా నటించిన 'ద వైట్ టైగర్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జనవరిలో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details