తెలంగాణ

telangana

చనిపోయిన ఏనుగు కోసం.. రాత్రంతా పొలంలోనే గజరాజుల తిష్ఠ!

By

Published : Jun 13, 2021, 10:15 AM IST

కుటుంబంలోని వ్యక్తి చనిపోతే మనం ఎంతలా బాధపడతామో... ఆ ముగజీవాలు కూడా తమ గుంపులోని ఒక జీవి మరణిస్తే అంతే ఆవేదనకు గురయ్యాయి. సమూహం నుంచి తప్పిపోయి మృతి చెందిన పిల్ల ఏనుగు కోసం... దానిని ఖననం చేసిన చోటే తిరుగుతూ మిగతా ఏనుగులు రోదించాయి.

ఏనుగు
ఏనుగు

ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతిగుట్ట గ్రామ సమీపంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఏనుగును ఖననం చేసిన ప్రదేశంలో పదమూడు ఏనుగులు శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు ఉండిపోయాయి. ఏనుగును ఖననం చేసిన ప్రదేశాన్ని చుట్టుముట్టి శబ్దాలు చేశాయి. వాటిని చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. తమ గుంపులోని ఏనుగు మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేని అవి గ్రామస్థులపైకి తిరగబడ్డాయి.

వాటిని అడవిలోకి తరిమేందుకు స్థానికులు ప్రయత్నించగా చాలాసేపు ప్రతిఘటించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది, గ్రామస్థులు కలిసి వాటిని కౌండిన్య నదిని దాటించారు. కోతిగుట్ట గ్రామ సమీపంలోని పొలంలో గురువారం అర్ధరాత్రి ఐదేళ్ల ఆడ ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందగా శుక్రవారం అటవీశాఖ సిబ్బంది దానిని అక్కడే ఖననం చేశారు.

ఇదీ చూడండి: Gold seize: భారీగా బంగారు ఆభరణాలు పట్టివేత

ABOUT THE AUTHOR

...view details