తెలంగాణ

telangana

తిరుమలలో ఏనుగుల సంచారం.. భయాందోళనలో భక్తులు

By

Published : May 15, 2022, 3:24 PM IST

Elephants at Tirumala: తిరుమలలో మరోసారి ఏనుగులు కలకలం సృష్టించాయి. పార్వేట మండపం వద్ద డివైడర్లు, పిట్టగోడను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.

తిరుమలలో ఏనుగుల సంచారం.. భయాందోళనలో భక్తులు
తిరుమలలో ఏనుగుల సంచారం.. భయాందోళనలో భక్తులు

Elephants at Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్న తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. స్థానిక పాపవినాశనం రోడ్డులో వేకువ జామున పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపుగా సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, పిట్ట గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గజరాజుల సంచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా సల్థాన్ని పరిశీలించారు. కాగా, ఇటీవల కాలంలో ఈ ఏనుగుల గుంపు తరచూ కనిపిస్తుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో ఏనుగుల సంచారం.. భయాందోళనలో భక్తులు

ABOUT THE AUTHOR

...view details