తెలంగాణ

telangana

Minister Puvvada Ajay : 'త్వరలోనే లాభాల బాటలో ప్రగతి రథచక్రాల పరుగులు'

By

Published : Oct 7, 2021, 2:10 PM IST

నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC) ప్రగతి రథచక్రాలు త్వరలోనే డబుల్ స్పీడ్​తో పరుగులు పెడతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్(Telangana Transport Minister Puvvada Ajay Kumar) ధీమా వ్యక్తం చేశారు. కార్గో, పార్శిల్ సేవల ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని మెరుగుపరుచునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బలోపేతానికి ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని కోరారు.

Minister Puvvada Ajay
Minister Puvvada Ajay

కార్మికుల సమ్మె, కరోనా మహమ్మారి, లాక్​డౌన్ వల్ల తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC) నష్టాల్లో కూరుకుపోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్(Telangana Transport Minister Puvvada Ajay Kumar) అన్నారు. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా.. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి పెరిగిన ఇంధన ధరలు పెనుభారమవుతున్నాయని పేర్కొన్నారు. కార్గో, పార్శిల్ సర్వీసులతో ఆర్టీసీని గాడిన పట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

"ఎన్ని ప్రాంతాల నుంచి కార్గో, పార్శిల్ సేవలు నడుస్తున్నాయి? వీటికి సంబంధించి ఈ-కామర్స్ సంస్థలతో బిజినెస్ లింకప్​ ఏమైనా చేశారా? ఏయే ప్రభుత్వ ఏజెన్సీలకు కార్గో సేవలు విస్తరించారు? గ్రామీణ ప్రాంతాల్లో కార్గో సేవలు విస్తరించారా? కార్గో, పార్శిల్ సేవల డోర్ డెలివరీ ఉందా?" అని శాసనసభలో పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమాధానమిచ్చారు.

గతేడాది జూన్ 19.. 2020​లో కార్గో, పార్శిల్ సేవలు ప్రారంభించామని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాస్త గాడిన పట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పువ్వాడ(Telangana Transport Minister Puvvada Ajay Kumar) తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 177 బస్టాండ్​ల నుంచి 790 మంది ఏజెంట్లు కార్గో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్గో, పార్శిల్ సేవలకు సంబంధించి ఈ-కామర్స్ సంస్థలతో బిజినెస్ లింకప్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అమెజాన్​తో లింకప్​ అయ్యేందుకు చర్చిస్తున్నామన్న మంత్రి.. త్వరలోనే ఎంఓయూపై సంతకం చేస్తామని స్పష్టం చేశారు. కార్గో సేవలు గ్రామాలకు కూడా విస్తరించామని.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​లోని చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

గతేడాది 2020లో టీఎస్​ఆర్టీసీ(Telangana RTC) ఆదాయం రూ.36 కోట్లు మాత్రమే ఉందని.. ఈయేడు దాదాపు రూ100 కోట్ల ఆదాయం గడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పువ్వాడ(Telangana Transport Minister Puvvada Ajay Kumar) వెల్లడించారు. కార్గో, పార్శిల్ సేవల ద్వారా ఈ లక్ష్యం చేరుతామని ధీమా వ్యక్తం చేశారు.

"కరోనా వల్ల టీఎస్​ఆర్టీసీ చాలా నష్టపోయింది. ఈ విషయం అర్థం చేసుకుని అసెంబ్లీలో ఎవరు ఆర్టీసీ గురించి ప్రశ్నలు అడగడం లేదని అర్థమవుతోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులేంటో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కరోనా గడ్డు కాలంలో ఇతర రాష్ట్రాలు ఆర్టీసీ ఉద్యోగులకు కనీస జీతం కూడా ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొవిడ్ కాలంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదని.. బడ్జెట్​లో రూ.1500 కోట్లు.. బడ్జెటేతర రూ.1500 కోట్లు వారి కోసం కేటాయించారు. కొవిడ్ సమయంలో అద్దె బస్సుల బకాయిలు చెల్లించడం కాస్త ఇబ్బందికరంగా ఉండేది. కానీ ప్రస్తుతం అద్దె బస్సుల బకాయిలు అన్ని చెల్లించాం."

- పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

అసెంబ్లీలో.. భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక డిపోపై ప్రశ్నించగా.. ముందు ఆర్టీసీ(Telangana RTC)ని బలోపేతం చేసి.. తర్వాత దుబ్బాక డిపో బలోపేతానికి తప్పక కృషి చేస్తామని మంత్రి పువ్వాడ(Telangana Transport Minister Puvvada Ajay Kumar) హామీ ఇచ్చారు. మరోవైపు.. ములుగు ఎమ్మెల్యే సీతక్క.. ములుగులో బస్టాండ్​ ఏర్పాటు చేయాలని కోరగా.. తప్పకుండా చేస్తామని భరోసానిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details