తెలంగాణ

telangana

Sajjanar ips: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ... ఆర్టీసీ ఎండీగా నియామకం

By

Published : Aug 25, 2021, 2:09 PM IST

Updated : Aug 25, 2021, 3:44 PM IST

cyberabad-police-commissioner-sajjanar-transferred-to-rtc-md
cyberabad-police-commissioner-sajjanar-transferred-to-rtc-md

14:08 August 25

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ

బదిలీ ఉత్తర్వులు

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆర్టీసీ ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ సీపీగా 2013 మార్చి 18న బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. సర్వీసులో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు.... సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.  

కొవిడ్ సమయంలో వలస కూలీలను ఆదుకోవడం, సొంత ప్రాంతాలకు తరలించడం కోసం చొరవ తీసుకున్నారు. కొవిడ్ రోగులకు తగిన వైద్యసాయం అందించేందుకు ఉచిత ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అందించడం, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. కరోనా  వేళ రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోవడంతో సజ్జనార్ ఏడాది వ్యవధిలో 3సార్లు రక్తదానం చేసి.. కమిషనరేట్​ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 5వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు అందించారు.  

శాఖాపరంగా పలు సంస్కరణలు చేపట్టారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పరిపాలన కొనసాగించారు. సైబరాబాద్ కమిషనరేట్​కు ఐజీ స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పశ్చిమ మండల ఐజీగా విధులు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర గతంలో హైదరాబాద్​లో డీసీపీగాను పనిచేశారు. 

ఇవీ చూడండి: KARVY CASE: పోలీసుల కస్టడీలోకి కార్వీ ఛైర్మన్‌ పార్థసారథి

Last Updated : Aug 25, 2021, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details