తెలంగాణ

telangana

'జీపీఎస్ గురించి అయితే చర్చలకు పిలవొద్దు.. తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు'

By

Published : Sep 6, 2022, 5:26 PM IST

CPS unions: ఏపీలో సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పాత పింఛన్‌పై మాట్లాడదామంటేనే చర్చలకు వచ్చామని సమావేశంలో స్పష్టం చేసినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. జీపీఎస్​ గురించే మాట్లాడాలనుకుంటే.. ఇకపై చర్చలకు పిలవవద్దని తేల్చిచెప్పినట్లు వారు వెల్లడించారు.

CPS unions
CPS unions

CPS unions: ఆంధ్రప్రదేశ్​లో సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పాత పింఛన్‌పై మాట్లాడదామంటేనే తాము వచ్చామని సమావేశంలో స్పష్టంచేసినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. జీపీఎస్‌ గురించి మాట్లాడాలనుకుంటే ఇకపై అసలు చర్చలకు పిలవొద్దని తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు. తాము సమావేశ గదిలోకి వెళ్లాక మంత్రులు యథాతథంగా జీపీఎస్‌ విధానంపైనే మాట్లాడదామన్నారని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు.

పాత పింఛను విధానంపై మాట్లాడదామంటేనే తాము వచ్చామని.. లేదంటే వచ్చేవాళ్లం కాదని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పాత పింఛనుపై మాట్లాడదామంటే మీరు జీపీఎస్‌ ట్రాక్‌లోకి రండి.. దానికి కొంత వెసులుబాట్లకు సిద్ధమేనని మంత్రులు చెప్పారని తెలిపారు. ప్రభుత్వం తరఫు నుంచి పాత పింఛను విధానానికి వచ్చే అవకాశం ఇసుమంత కూడా లేదని .. మరి ఆమాత్రం దానికి ఎందుకు ప్రతిసారీ చర్చలకు పిలవడం దేనికి.. ఇది కరెక్టు కాదని చెప్పామని ఏపీసీపీఎస్‌యూఎస్‌ అధ్యక్షుడు మరియదాస్‌ తెలిపారు.

మరోవైపు, వేలాది సీపీఎస్‌యూఎస్‌ నాయకులు, టీచర్లపై కేసులు పోలీసులు కేసులు పెట్టారని, అక్రమ కేసులు రద్దు చేయాలని కోరినట్టు సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. డీజీపీని కలిసి కేసులు ఎత్తివేయాలని కోరనున్నట్టు వారు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 1న పోలీసులు తమ ఇళ్లు ముట్టడించారని నేతలు రవికుమార్‌, దుర్గారావు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

"పాత పింఛన్‌పై మాట్లాడదామంటేనే చర్చలకు వచ్చాం. చర్చలకు పిలిచి మళ్లీ జీపీఎస్ గురించే మాట్లాడుతున్నారు. ఇకపై అసలు చర్చలకు పిలవొద్దని ప్రభుత్వానికి చెప్పాం. వేలాది సీపీఎస్‌యూఎస్ నాయకులు, టీచర్లపై కేసులు పెట్టారు. అక్రమ కేసులు రద్దు చేయాలని కోరాం. డీజీపీని కలిసి కేసులు ఎత్తివేయాలని కోరుతాం. సెప్టెంబర్ 1న పోలీసులు మా ఇళ్లు ముట్టడించారు. మహిళా ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు." -మరియదాస్, ఏపీసీపీఎస్‌యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

CPS unions: 'జీపీఎస్ గురించి అయితే, చర్చలకు పిలవొద్దని చెప్పాం'

ఇవీ చదవండి:వర్ధన్నపేట కలుషిత ఆహార ఘటనపై స్పందించిన కలెక్టర్.. వార్డెన్ సస్పెండ్

మెటల్ ల్యాంప్​తో భార్యను హతమార్చిన భర్త.. అదే కారణమా?

ABOUT THE AUTHOR

...view details