తెలంగాణ

telangana

Vaccination : అక్రిడేషన్ లేకున్నా జర్నలిస్టులకు వ్యాక్సినేషన్​

By

Published : May 28, 2021, 6:51 PM IST

Updated : May 28, 2021, 10:59 PM IST

రాష్ట్రంలో జర్నలిస్టులందరూ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ కోరారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్​గా గుర్తించి టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

covid vaccination, covid vaccination in lock down
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్, తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్

రాష్ట్రంలో పాత్రికేయులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సద్వినియోగపర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28, 29 తేదీల్లో జర్నలిస్టులను "ఫ్రంట్ లైన్ వారియర్స్‌"గా గుర్తించి రాజధాని హైదరాబాద్‌లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యూనాని ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రులను ప్రత్యేక టీకా కేంద్రాలుగా కేటాయించినట్లు తెలిపారు.

ప్రభుత్వ అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులతో పాటు అక్రిడేషన్ లేని పాత్రికేయులందరూ కూడా తమ సంస్థల గుర్తింపు కార్డులు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో విధిగా చూపి నమోదు చేసుకుని, టీకాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది పాత్రికేయులు అక్రిడేషన్ కార్డులు కలిగి ఉన్నారని.. వారితోపాటు లేని జర్నలిస్టులు కూడా టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల స్థాయిలో కూడా జర్నలిస్టులకు టీకాలు ఇస్తున్న దృష్ట్యా.. సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Last Updated :May 28, 2021, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details