తెలంగాణ

telangana

విమానయానరంగంపై పడిన కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం

By

Published : Mar 13, 2022, 3:48 PM IST

Covid effect on air passengers: కొవిడ్‌ మూడో దశ విజృంభిస్తుందని జరిగిన ప్రచార ప్రభావం విమానయాన రంగంపైన పడింది. దాంతో ఈ ఏడాది జనవరిలో దేశీయ, విదేశీయ విమాన‌ ప్ర‌యాణాలు 8.7శాతం తగ్గినట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఇప్పుడిప్పుడే ప్రయాణాలు తిరిగి పుంజుకుంటుందని... త్వరలోనే పూర్వవైభవం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Covid effect on Aviation sector
విమానయానరంగంపై కొవిడ్ ప్రభావం

Covid effect on air passengers: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ విజృంభిస్తుందని జోరుగా జరిగిన ప్రచారం విమానరంగంపై ప్రభావం చూపింది. ఈ ఏడాది జనవరిలో విమాన ప్రయాణాలు 8.7 శాతం తగ్గినట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఏడాది జనవరిలో 1,67,33,136 మంది విమానాలల్లో ప్రయాణించగా.. ఈ ఏడాది జనవరిలో 1,52,72,179 మంది మాత్రమే ప్ర‌యాణాలు చేసిన‌ట్లు వెల్లడించింది. మొత్తం మీద విదేశీ ప్రయాణాలు 67.5 శాతం పెరగ్గా, డొమెస్టిక్‌ ప్రయాణాలు 16.2 శాతం తగ్గాయి.

Covid effect on air passengers: తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి విదేశాల‌కు వెళ్లిన ప్ర‌యాణీకుల సంఖ్య 75శాతం పెరిగింది. ఇక్క‌డ గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో 90,085 మంది ప్ర‌యాణించ‌గా, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో 1,57,640 మంది ప్ర‌యాణించిన‌ట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అదేవిధంగా విజయవాడ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు జనవరి నెల‌లో 41.8శాతం తగ్గగా, విశాఖపట్నం నుంచి విదేశాలకు జనవరి నెలలో 530 మంది ప్రయాణించారు.

త్వరలోనే పూర్వ వైభవం...

Corona effect on air passengers: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన డొమెస్టిక్‌ ప్రయాణాలను పరిశీలించినట్లయితే తిరుపతి నుంచి 5.6శాతం ప్రయాణాలు పెరగ్గా, విజయవాడ నుంచి 37.9శాతం, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి17.2శాతం, విశాఖపట్నం నుంచి 22.1శాతం ప్రయాణాలు తగ్గినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. కొవిడ్ రెండో ద‌శ తీవ్ర రూపం దాల్చి ల‌క్ష‌లాది మంది దాని ప్ర‌భావానికి గురై వేలాది మంది మృత్యువాత‌ ప‌డ్డారు. దీంతో జ‌నం బెంబేలెత్తిపోయారు. ఆ త‌రువాత మూడో ద‌శ కొవిడ్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని.. విజృంభించే అవ‌కాశం ఉంద‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో విమానాల‌ల్లో తిరిగే ప్ర‌యాణీకుల సంఖ్య త‌గ్గింది. ఫిబ్రవరి నుంచి ప్రయాణాలు తిరిగి పుంజుకున్నట్లు చెబుతున్న ఎయిర్‌ పోర్టు అధికారులు విమానయానాలకు త్వ‌ర‌లోనే పూర్వవైభవం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:CII Letter To KTR: 'ఆ ఛార్జీల వసూలు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details