తెలంగాణ

telangana

ప్రధాని పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగరవేత.. పలువురి అరెస్టు!

By

Published : Jul 4, 2022, 9:24 PM IST

BLACK BALLOONS: ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని పర్యటనను నిరసిస్తూ.. కాంగ్రెస్‌ నాయకులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో నల్లబెలూన్లను ఎగురవేసి.. కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ప్రధాని పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగరవేత
ప్రధాని పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగరవేత

BLACK BALLOONS: ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని పర్యటనను నిరసిస్తూ.. కాంగ్రెస్‌ నాయకులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో నల్లబెలూన్లను ఎగురవేసి.. కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ టేకాఫ్‌ అయి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో.. నల్లబెలూన్లను గాల్లోకి వదిలారు. కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు, పలువురు ఎమ్మార్పీఎస్​ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏలూరులోనూ..:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్‌ నాయకులు నిరసన చేపట్టారు. మోదీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపేందుకు భీమవరం బయల్దేరిన కాంగ్రెస్ నాయకులను.. పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సీరియస్​గా పరిగణిస్తున్నాం..: బెలూన్లు ఎగరవేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేశామని అన్నారు. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారని డీఎస్పీ విజయ్‌పాల్‌ నేతృత్వంలో విచారణ ప్రారంభమైందన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రతన్‌ బెలూన్లు ఎగరవేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. బెలూన్లు ఎగరవేసిన ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్లు తెలిపారు.

"నల్ల బెలూన్లు ఎగరవేసిన ఘటనలో నలుగురు అరెస్టు. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ సహా నలుగురిని అరెస్టు చేశాం. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తాం. నల్ల బెలూన్లు ఎగరవేసిన రాజీవ్ రతన్ కోసం గాలిస్తున్నాం.-విజయ్‌పాల్‌, డీఎస్పీ

ప్రధాని పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగరవేత

ఇదీ చదవండి:రేపటి నుంచి వాళ్లకే రైతుబంధు నిధులు

'తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి కావాలి.. ప్రత్యేక దేశం కోసం పోరాడేలా చేయకండి'

ABOUT THE AUTHOR

...view details