తెలంగాణ

telangana

Ap Inter: ఇంటర్ ఫలితాల వెల్లడికి తొమ్మిది మందితో కమిటీ

By

Published : Jun 29, 2021, 5:32 PM IST

ఏపీ ఇంటర్మీడియట్ రెండో ఏడాది ఫలితాల విడుదలకు అనుసరించాల్సిన విధివిధానాలపై సిఫార్సు చేసేందుకు ఇంటర్ విద్యామండలి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది.

Committee
ఇంటర్

ఇంటర్మీడియట్ రెండో ఏడాది(Inter Second Year Results) ఫలితాల విడుదలకు అనుసరించాల్సిన విధివిధానాలపై సిఫార్సు చేసేందుకు ఏపీ ఇంటర్ విద్యామండలి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్ ఛాయరతన్ ఛైర్​పర్సన్​గా తొమ్మిది మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

సభ్య - కన్వీనర్​గా ఇంటర్ విద్యామండలి సీవోఈ రమేశ్, ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ పరీక్షల విభాగం విశ్రాంత ఏడీ ఆనంద్ కిశోర్, సాంకేతిక సహకారానికి సీఎఫ్​ఎస్ఎస్ తరఫున శ్రీనివాస్, సభ్యులుగా పశ్చిమగోదావరి జిల్లా ఆర్​ఐవో ప్రభాకర్, తుడిమెళ్ల కళాశాల ప్రిన్సిపల్ సైమన్ విక్టర్, అకూనూరు, చేబ్రోలు, నెల్లూరు కళాశాలల లెక్చరర్లు రూపకుమారి, శ్రీనివాసరావు, మోహన్​రావులను నియమించారు.

ఫలితాల విడుదలకు అనుసరించాల్సిన పద్ధతులపై కమిటీ ఏర్పాటు నుంచి ఐదు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:Toss: అందరూ ఉత్తీర్ణులే... ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు

ABOUT THE AUTHOR

...view details