తెలంగాణ

telangana

KCR REVIEW: 'రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలపై బలమైన వాణి వినిపించాలి'

By

Published : Aug 8, 2021, 7:08 AM IST

హైదరాబాద్​ ప్రగతిభవన్​లో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండో రోజు సమీక్ష నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన సమీక్ష అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సాగింది. బోర్డుల సమావేశంలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఒకవేళ బోర్డు సమావేశాలకు విధిగా హాజరు కావాల్సి వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలపై బలమైన వాణి వినిపించాలని అధికారులు, ఇంజినీర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

kcr
కేసీఆర్​

గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా, గోదావరి బోర్డులు కసరత్తు చేస్తున్న వేళ నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండో రోజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్​లోని ప్రగతి భవన్​లో జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, అంతర్ రాష్ట్ర విభాగం ఇంజినీర్లతో సీఎం సమావేశమయ్యారు. మధ్యాహ్నం ప్రారంభమైన సమీక్ష అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సాగింది. బోర్డుల సమావేశంలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు.

మరికొన్ని లేఖలు రాసే అవకాశం..

గెజిట్ నోటిఫికేషన్​కు సంబంధించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నిలువరించాలని కోరుతూ సమీక్ష కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ పంపారు. ఇదే తరహాలో ఇటు బోర్డులు, అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. బోర్డులు, కేంద్రానికి మరికొన్ని లేఖలు రాసే అవకాశం కనిపిస్తోంది.

విధిగా హాజరు కావాల్సి వస్తే..

రేపు జరగనున్న బోర్డుల ఉమ్మడి సమావేశానికి హాజరు కావాల్సిందేనని రెండు బోర్డులు స్పష్టం చేసిన నేపథ్యంలో సంబంధిత అంశాలపై చర్చించారు. ఒకవేళ బోర్డు సమావేశాలకు విధిగా హాజరు కావాల్సి వస్తే అక్కడ రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలపై బలమైన వాణి వినిపించాలని అధికారులు, ఇంజినీర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి:వందేళ్ల భారత నిరీక్షణకు తెర

ABOUT THE AUTHOR

...view details