తెలంగాణ

telangana

పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ సమీక్ష

By

Published : Jun 8, 2020, 2:07 PM IST

Updated : Jun 8, 2020, 2:30 PM IST

మరికాసేపట్లో ఉత్కంఠకు తెరపడనుంది. పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తున్నారు.

kcr
kcr

పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరీక్షలు రద్దు చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.

పంజాబ్, మహారాష్ట్రలో పరీక్షలు లేకుండా ప్రమోట్ చేశారు. ఆ రాష్ట్రాల్లో ఎలా చేశారో అనే అంశాలపై అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. కరోనా అదుపులోకి వస్తే జులైలో పరీక్షలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది.

Last Updated :Jun 8, 2020, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details