తెలంగాణ

telangana

AP CM Jagan On Rains: వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించండి: జగన్​

By

Published : Jul 22, 2021, 6:16 PM IST

ఏపీలో భారీ వర్షాలపై ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అప్రమత్తం చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

AP CM Jagan alert On Rains
సీఎం జగన్​

ఆంధ్రప్రదేశ్​లో భారీ వర్షాలు కురుస్తున్నందున (Heavy Rains) అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్(CM jagan) సూచించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన జగన్​ పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయటకి రావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం..

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతవరణ శాఖ వెల్లడించింది. సముద్ర తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

చేపల వేటకు వెళ్లొద్దు..

మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ కె.కన్నబాబు సూచించారు.

ఇదీ చదవండి:

Telangana Rains: ప్రజలెవ్వరూ ఇళ్లలో నుంచి బయటకురావద్దు: సీఎం కేసీఆర్​

Telangana Heavy Rains: రాష్ట్రంలో రాగల మూడురోజులు అతి భారీ వర్షాలు!

TS RAINS : సింగరేణి ఏరియాల్లో భారీ వర్షం.. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

Heavy Floods to Projects : ముంచెత్తుతున్న వానలు.. నిండుకుండలా జలాశయాలు

ABOUT THE AUTHOR

...view details