తెలంగాణ

telangana

పనిచేయలేనివారు పక్కకు తప్పుకోండి.. ఢీ అంటే ఢీ అనేవారే కావాలి: చంద్రబాబు

By

Published : Jan 5, 2022, 5:27 PM IST

Updated : Jan 5, 2022, 8:21 PM IST

Chandrababu on party leaders: ఏపీలో వచ్చే రానున్నవి ఆషామాషీ ఎన్నికలు కావని.. రౌడీయిజం, విధ్వంసాన్ని తట్టుకొని నిలబడాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ప్రతినిధుల అంతర్గత భేటీలో మాట్లాడిన ఆయన.. పనిచేయకుండానే పదవులు ఆశించకూడదని స్పష్టం చేశారు. పని చేయలేని వారు పక్కకు తప్పుకోవాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Chandrababu sensational comments
Chandrababu

Chandrababu on party leaders: పార్టీ ప్రతినిధుల అంతర్గత భేటీలో తెదేపా అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పనిచేయలేని నియోజకవర్గ ఇంఛార్జులు ఉంటే పక్కకు తప్పుకోవాలన్నారు. స్వచ్ఛందంగా తప్పుకుంటే కొత్తవారికి అవకాశం వస్తుందని చెప్పారు. పనిచేయకుండానే పదవులు వచ్చేయాలని ఆశించకూడదని స్పష్టం చేశారు.

Chandrababu on Kuppam: కుప్పం.. తెలుగుదేశం పార్టీకి తిరుగులేని నియోజకవర్గమన్న చంద్రబాబు.. అలాంటి కుప్పంలోనే తనను ఇబ్బందిపెట్టారని వ్యాఖ్యానించారు. కుప్పంలోనే ఇబ్బంది పెట్టారంటే మిగతా చోట్ల పరిస్థితిని ఊహించవచ్చని చెప్పారు.

పార్టీలో ఉంటూ నష్టం కలిగించే వారిని ఉపేక్షించబోనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని.. రౌడీయిజం, విధ్వంసాన్ని తట్టుకొని నిలబడాలని... శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే కావాలన్నారు.

"పనిచేయలేని ఇంఛార్జులు ఉంటే పక్కకు తప్పుకోండి. స్వచ్ఛందంగా తప్పుకుంటే కొత్తవారికి అవకాశం వస్తుంది. పనిచేయకుండానే పదవులు వచ్చేయాలని ఆశించకూడదు. పార్టీలో ఉంటూ నష్టం కలిగించే వారిని ఉపేక్షించను. వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు. రౌడీయిజం, విధ్వంసాన్ని తట్టుకొని నిలబడాలి. ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే కావాలి"

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీచూడండి:జగన్ చేసిన తప్పులను.. చరిత్ర మరచిపోదు: చంద్రబాబు

Last Updated : Jan 5, 2022, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details